మళ్లీ చర్చల్లోకి మెగా ‘విక్రమ్‌ వేద’

Update: 2020-02-11 11:15 GMT
మళ్లీ చర్చల్లోకి మెగా ‘విక్రమ్‌ వేద’
తమిళంలో సూపర్‌ హిట్‌ అయ్యి 2017 బిగ్గెస్ట్‌ హిట్‌ చిత్రాల జాబితాలో నిలిచిన ‘విక్రమ్‌ వేద’ చిత్రాన్ని తెలుగులో రీమేక్‌ చేసేందుకు అప్పట్లోనే ప్రముఖ తెలుగు నిర్మాత అల్లు అరవింద్‌ రీమేక్‌ రైట్స్‌ ను కొనుగోలు చేసిన విషయం తెల్సిందే. ఈ రీమేక్‌ ను మెగా హీరోతో నిర్మించేందుకు అల్లు అరవింద్‌ మొదటి నుండి ప్రయత్నాలు చేస్తున్నాడు. అయితే ఏదో ఒక కారణం వల్ల రీమేక్‌ వెనుకబడి పోతూ ఉంది. ఎట్టకేలకు మళ్లీ ఈ రీమేక్‌ వార్తలు మళ్లీ మొదలయ్యాయి.

మాధవన్‌.. విజయ్‌ సేతుపతి కీలక పాత్రల్లో నటించిన విక్రమ్‌ వేదను మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ తో రీమేక్‌ చేయాలని అల్లు అరవింద్‌ భావిస్తున్నాడట. అందుకు సంబంధించిన చర్చలు జరుపుతున్నారట. ప్రస్తుతం ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రం సూటింగ్‌ లో బిజీగా ఉన్న చరణ్‌ ఆ తర్వాత చిరు 152 చిత్రంలో కీలకమైన కొన్ని సన్నివేశాల్లో నటించబోతున్నాడు. ఆ తర్వాత జెర్సీ దర్శకుడు గౌతమ్‌ దర్శకత్వంలో చరణ్‌ మూవీ ఉంటుందని అంటున్నారు.

ఇదే సమయంలో విక్రమ్‌ వేద రీమేక్‌ కు కూడా చరణ్‌ ఓకే చెప్పే అవకాశాలు కనిపిస్తున్నాయి. గౌతమ్‌ దర్శకత్వంలో కంటే ముందు విక్రమ్‌ వేద రీమేక్‌ లో చరణ్‌ నటించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని మెగా కాంపౌండ్‌ నుండి టాక్‌ వినిపిస్తుంది. విక్రమ్‌ వేద చిత్రంలో మాధవన్‌ పాత్రలో చరణ్‌ నటించనుండగా విజయ్‌ సేతుపతి పాత్రకు గాను రవితేజ తో పాటు మరో ఇద్దరు హీరోలతో చర్చలు జరుపుతున్నారు.

తెలుగు ప్రేక్షకుల అభిరుచి కి తగ్గట్లు గా ఈ చిత్రం స్క్రిప్ట్‌ ను మార్పులు చేర్పులు చేయబోతున్నారు. ఈ రీమేక్‌ కు ఎవరు డైరెక్టర్‌ గా వ్యవహరిస్తారు అనేది కూడా చూడాలి. చర్చలు జరుగుతున్న తీరును చూస్తుంటే ఇదే ఏడాది ఈ రీమేక్‌ సెన్స్‌ పైకి వెళ్లే అవకాశం కనిపిస్తుంది.
Tags:    

Similar News