పవనిజంను కాపీ కొట్టి.. కొత్త ఇజం

Update: 2016-12-04 04:47 GMT
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ కు తమిళనాట విపరీతమైన క్రేజ్ ఉంటుంది. నెక్ట్స్ రజినీకాంత్ అనిపించుకునేందుకు విజయ్ పడే ఆరాటం అంతా ఇంతా కాదు. అలాగే సూపర్ స్టార్ రజినీకాంత్ ను తలైవా అని అందరూ పిలుచుకుంటే.. విజయ్ ను ఇలయదళపతి అంటూ ఉంటారు.

ఇక్కడ పవనిజంను కాపీ అనాల్సిన పరిస్థితి ఎందుకొచ్చిందంటే.. ఇప్పుడు అక్కడ కొత్త ఇజం మొదలైంది. అదే 'దళపతి ఇజం'. అది కూడా 24 ఏళ్లు పూర్తయిందట. 1992 డిసెంబర్ 4న విజయ్ హీరోగా నటించిన మొదటి సినిమా నాలైయ తీర్పు విడుదలైంది. ఇప్పటికి ఆ మూవీ వచ్చి 24 ఏళ్లు పూర్తి కావడంతో.. పవన్ కళ్యాణ్ పేరుతో పవనిజం మాదిరిగా.. '24 ఏళ్ల దళపతిఇజం' అంటూ కొత్త కాన్సెప్ట్ ట్రెండింగ్ చేస్తున్నారు.

నిజానికి పవన్ కంటే నాలుగేళ్లు ముదే విజయ్ తెరంగేట్రం చేశాడు. కానీ స్టార్ హీరో ఇమేజ్ అందుకోవడానికి మాత్రం కాస్త టైమ్ పట్టినా.. తిరుగులేని ఇమేజ్ తో దూసుకుపోతున్నాడు. కాకపోతే.. ఇలా దళపతిఇజం అంటుంటే మాత్రం.. కాపీ ఫ్లేవర్ తగిలేస్తోంది. చాలాసార్లు రీమేక్ లతో(ఎక్కువగా పవన్ సినిమాలు) హిట్లు కొట్టిన విజయ్.. ఇప్పుడు ఇజం  విషయంలో కూడా పవన్ ని ఫాలో అయిపోతున్నాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News