నయన్.. పబ్లిగ్గా చెప్పేశారా??

Update: 2016-11-19 11:30 GMT
నయనతార- తమిళ్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్ మధ్య సమ్ థింగ్ సమ్ థింగ్ అని చాలారోజుల నుంచి వినిపిస్తోంది. వీళ్లూ కూడా తమ మధ్యలో ఏదో ఉందని కానీ.. ఏమీ లేదని కానీ చెప్పరు. అలాగని ఫ్రెండ్షిప్ ని సీక్రెట్ గా కూడా ఉంచరు. కలిసి తిరుగుతారు.. క్లోజ్ గా ఫోటోస్ దిగుతారు. అవార్డ్స్ ఫంక్షన్స్ లో జోక్స్ వేసుకుంటూ మిగిలిన ప్రపంచాన్ని పట్టించుకోకుండా ఎంజాయ్ చేస్తుంటారు.

నానుమ్ రౌడీధాన్ మూవీ సమయంలో పెరిగిన నయన్- విఘ్నేష్ బాండింగ్ రోజు రోజుకూ ముదిరిపోతుంది. నయన్ సైడ్ నుంచి ఎలాంటి రియాక్షన్ ఉండదు కానీ విఘ్నేష్ మాత్రం ఛాన్స్ వచ్చినప్పుడల్లా నయన్ మీద లవ్ ని ఓపెన్ గానే ఎక్స్ ప్రెస్ చేస్తుంటాడు. ఆ మధ్య బెస్ట్ డైరెక్టర్ గా గెల్చుకొన్న అవార్డ్ తో నయన్తో ఫోటో దిగి గోల్డెన్ లేడీ అంటూ దాన్నే డీపీగా పెట్టుకొన్నాడు. ఇక నయన్ బర్త్ డే రావడంతో రోజు మొత్తం నయన్ సింగిల్ పిక్ ని డీపీగా ఉంచేశాడు.

అంతేకాదు ఆ స్మైల్ ని చూస్తే ఎవరైనా హ్యాపీ ఫీలవ్వాల్సిందే అంటూ ఓ స్టేట్ మెంట్ కూడా పెట్టాడు. డే మారిన వెంటనే విఘ్నేష్ భుజం మీద చేయి వేసి ఒరగా చూస్తోన్న నయన్ ఫోటోని ప్రొఫైల్ పిక్ గా ఉంచాడు. టోటల్ గా ఒక్కరోజులోనే 3 ఇమేజెస్ మార్చి మా గురించి మీ ఊహాకే వదిలేస్తున్నామన్నట్టు ఫోజులిచ్చారు ఈ ఇద్దరూ. అన్నట్టు నయన్- విఘ్నేష్ కి అల్రెడీ పెళ్లైపోయిందని వార్తలు కూడా వస్తున్నాయ్. వాటి మీద నోరెత్తట్లేదు. కానీ ట్విట్టర్లో మాత్రం ఇలా ఫోటోస్ అప్ లోడ్ చేస్తున్నారు. అంటే పిక్చర్ సేస్ ఇట్ ఆల్ అనే కోట్ ని ఇక్కడ అప్లై చేస్తున్నారనుకోవచ్చా?!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News