యువి క్రియేషన్స్ మరో బ్యానర్ .. కొత్తవారి కోసమేనట!

Update: 2020-12-30 01:30 GMT
ప్రస్తుతం టాలీవుడ్ లో వెల్ నోటెడ్ బ్యానర్స్ లో ఒకటి యువి క్రియేషన్స్. ఇప్పటి వరకూ పలు భారీ బడ్జెట్, విజయవంతమైన చిత్రాలు ప్రొడ్యూస్ చేసింది ఈ బ్యానర్.

2013 లో ప్రభాస్ ‘మిర్చి’తో మొదలైన యువి పతాకం.. భారీ హిట్ తో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత.. శర్వానంద్ హీరోగా వచ్చిన రన్ రాజా రన్, నాని ‘భలే భలే మగడివోయ్’, అనుష్క ‘భాగమతి’, ప్రభాస్ ‘సాహో’తోపాటు పలు చిత్రాలను ఈ ప్రొడక్షన్ హౌస్ నిర్మించింది. ప్రస్తుతం ప్రభాస్-పూజా హెగ్డే కాంబినేషన్లో తెరకెక్కుతున్న పాన్-ఇండియా మూవీ ‘రాధేశ్యాం’ యువి క్రియేషన్స్ ప్రొడక్టే. భారీ బడ్జెట్ తో ఈ చిత్రం నిర్మితమవుతోంది.

అయితే.. లేటెస్ట్ విషయం ఏమిటంటే.. ఈ ప్రొడక్షన్ హౌస్ మరో బ్యానర్‌ ను ఏర్పాటు చేస్తోంది. ఈ కొత్త బ్యానర్‌కు ‘వి సెల్యులాయిడ్స్’ అని పేరు పెట్టనున్నారు. నిర్మాతలు ప్రమోద్, వంశీ, విక్రమ్ ఇందులో భాగం కానున్నారు.

సక్సెస్ ఫుల్ బ్యానర్ ఒకటి ఉండగా.. మరొకటి ఎందుకనే సందేహం చాలా మందికి రావొచ్చు. అయితే.. ఈ సెకండ్ బ్యానర్ ద్వారా స్మాల్, మీడియం బడ్జెట్ చిత్రాలను తెరకెక్కిస్తారట. ప్రతిభావంతులైన కొత్త దర్శకులకు, ఆర్టిస్టులకు ఇందులో అవకాశాలు ఇస్తారట. కాన్సెప్ట్ బేస్డ్ మూవీస్ ఈ బ్యానర్ లో నిర్మిస్తారని సమాచారం.

వాస్తవానికి యువి క్రియేషన్స్ ఇంతకు ముందు గీతా ఆర్ట్స్ తో కలిసి చిన్న, మధ్యతరహా బడ్జెట్ చిత్రాలు నిర్మించేందుకు ‘జిఎ 2 యువి క్రియేషన్స్ ను ఏర్పాటు చేసింది. అయితే.. ఇప్పుడు తన సొంతంగా స్మాల్ మూవీస్ ను నిర్మించేందుకే ఈ ‘వి సెల్యులాయిడ్స్‌’ను ప్రారంభిస్తోందట.
Tags:    

Similar News