మథనం టీమ్ కు యూఎస్ పంపిణీ మాఫియా దెబ్బ?

Update: 2019-12-06 10:42 GMT
సినిమాను ప్రేక్షకులకు చేరువ చెయ్యడం కోసం కొత్త కొత్త  ట్రిక్కులు.. కొత్త ఐడియాలు వేస్తుంటారు ఫిలింమేకర్స్.  అయితే అన్నిసార్లు అన్ని ఐడియాలు ఫలితాన్నివ్వవు. ఈమధ్య 'మథనం' టీమ్ తమ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో విడుదల చెయ్యకుండా అమెరికాలో మాత్రమే విడుదల చేస్తామని.. ఇలా చేస్తున్న మొదటి తెలుగు సినిమా ఇదేనని పబ్లిసిటీ చేసుకునేందుకు ప్రయత్నించారు.

నిజానికి 'మథనం' ఎప్పుడో ఆగస్ట్ నెలలోనే విడుదల కావాల్సిన సినిమా. అయితే ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు.. బయ్యర్లు.. డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాను రిజెక్ట్ చెయ్యడంతో అమెరికాలో ఓన్ రిలీజ్ కోసం ప్రయత్నించారు. అక్కడ హిట్ అయితే తర్వాత ఇక్కడ రిలీజ్ చెయ్యాలనేది అసలు ప్లాన్ అని టాక్..  అయితే అమెరికాలో పెద్ద పెద్ద స్టార్ హీరోల సినిమాలనే పట్టించుకోవడం లేదు.. ఇక చిన్న సినిమాల  సంగతి ఎవరు పట్టించుకుంటారు? ఈ సినిమాను ఆమెరికాలో ఒక చిన్న డిస్ట్రిబ్యూటర్ ను నమ్మి అతని చేతిలో పెట్టారట.  లిమిటెడ్ థియేటర్లలో రిలీజ్ చెయ్యాలని ప్లాన్ చేసుకున్నారట.  అయితే అమెరికా డిస్ట్రిబ్యూటర్ల వ్యవహారం పూర్తిగా వేరు.. అక్కడి వారిపై ఇక్కడ ఉండేవారికి అదుపు ఉండదు.  ఇప్పుడు తీరా చూస్తే అసలు సినిమా రిలీజ్ ఉందో లేదో కూడా తెలియని పరిస్థితిలో ఫిలిం మేకర్స్ ఉన్నారట.

యూఎస్ లో డిస్ట్రిబ్యూటర్ మాఫియా దెబ్బకు పెద్ద పెద్ద సంస్థలే తలలు పట్టుకు కూర్చుంటున్నాయని.. ఈసారి దెబ్బ ఈ 'మథనం' టీమ్ కు తగిలిందని అంటున్నారు. ఈ విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

    

Tags:    

Similar News