మిస్టర్ -Cతో క్వారంటైన్ లో ఉపాసన
మెగాస్టార్ చిరంజీవి కోవిడ్ కి చికిత్స పొంది కోలుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు తనకూ కోవిడ్ -19 పాజిటివ్ వచ్చిందని ప్రకటించి రామ్ చరణ్ అభిమానులకు పెద్ద షాకిచ్చారు. గత కొద్ది రోజులుగా తాను కలిసిన ప్రతి ఒక్కరూ వైరస్ కోసం పరీక్షలు జరపాలని కోరారు. రామ్ చరణ్ కి అసలు వైరస్ లక్షణం కనిపించలేదు. ప్రస్తుతానికి ఇంట్లోనే నిర్బంధంలో ఉన్నారు.
చరణ్ తో కలిసి ఉపాసన సైతం క్వారంటైన్ లో ఉన్నారు. తన ఇంటి దిగ్బంధం నుండి ఒక చిత్రాన్ని పోస్ట్ చేసింది. ఆమె దీనికి ఇలా శీర్షిక ఇచ్చింది. ``ఇది కూడా పాస్ అవుతుంది. లక్షణాలు లేవు.. అతను బలంగా ఉన్నాడు`` అని ఉపాసన తెలిపారు.
``నాకు నెగెటివ్ అని పరీక్షలో తేలింది. కానీ పాజిటివ్ గా మారే వీలుంది. ప్రస్తుతానికి మిస్టర్- సీతో హోమ్ క్వారంటైన్ లో ఉన్నాను. వెచ్చని ద్రవాలు తాగడం.. ఆవిరి పీల్చడం.. విశ్రాంతి లోడ్ చేయడం ఇదీ పని`` అని తెలిపారు. మొత్తానికి చెర్రీని కలిసిన వారంతా జాగ్రత్తలతో ఉన్నారని అర్థమవుతోంది.