చిరు-బాల‌య్య‌ను కాద‌ని మ‌హేష్ తోనా?

Update: 2021-07-25 07:30 GMT
టాలీవుడ్ ని ద‌శాబ్ధం పైగానే అగ్ర క‌థానాయిక‌గా ఏలిన త్రిష ఇటీవ‌ల చెన్నైకి అంకిత‌మై హైద‌రాబాద్ ప‌రిశ్ర‌మ‌కి దూర‌మైపోయిన సంగ‌తి తెలిసిందే. త‌మిళ ప‌రిశ్ర‌మ‌లో వ‌రుస చిత్రాల్లో న‌టిస్తూ త‌న స్టార్ డ‌మ్ ని నిల‌బెట్టుకుంటున్న త్రిష త్వ‌ర‌లోనే తెలుగులోనూ రీఎంట్రీ ఇస్తుంద‌ని క‌థ‌నాలు వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే.

అయితే త్రిష‌కు ఇప్ప‌టికే రెండు క్రేజీ ఆఫ‌ర్లు టాలీవుడ్ నుంచి వెతుక్కుంటూ వెళ్లాయి. మెగాస్టార్ చిరంజీవి స‌ర‌స‌న ఆచార్య‌లో తొలిగా త్రిషనే ఎంపిక చేయ‌గా వ్య‌క్తిగ‌త కార‌ణాల‌తో ఆ ప్రాజెక్ట్ నుంచి వైదొలగిన సంగ‌తి తెలిసిందే. ఆ త‌ర్వాత బాల‌య్య - గోపిచంద్ మ‌లినేని క్రేజీ ప్రాజెక్ట్ నుంచి క్రియేటివ్ డిఫ‌రెన్సెస్ వ‌ల్ల త‌ప్పుకోవాల్సి వ‌చ్చింది.

ఇప్పుడు మ‌హేష్ - త్రివిక్ర‌మ్ మూవీకి రెండో నాయిక‌గా ఆఫర్ ఇచ్చార‌ని ప్ర‌చార‌మ‌వుతోంది. కానీ త్రిష అలాంటి ఆఫ‌ర్ కి ఓకే చెబుతుందా? అన్న గుస‌గుసా వేడెక్కిస్తోంది. ఈ చిత్రంలో జాన్వీ క‌పూర్ క‌థానాయిక‌గా న‌టిస్తుంద‌ని .. నివేద థామ‌స్.. పూజా హెగ్డే పేర్లు ప‌రిశీల‌న‌లో ఉన్నాయ‌ని ఇన్నాళ్లు క‌థ‌నాలొచ్చాయి. ఒక‌వేళ ఆ ముగ్గురి నుంచి ఒక‌రిని ఎంపిక చేసుకున్నా త్రిష పాత్ర ఏమిటి? అన్న‌ది స‌స్పెన్స్.

ఇక‌పోతే చిరంజీవి.. బాల‌య్య లాంటి అగ్ర హీరోల‌తో కుద‌ర‌క‌పోయినా మ‌హేష్ తో ఆఫ‌ర్ స‌రైన‌దే.. కానీ త్రిష  ఓకే చెబుతుందా లేదా? అన్న‌ది స‌స్పెన్స్. మ‌హేష్ - త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్ లో అత‌డు చిత్రంలో త్రిష క‌థానాయిక‌గా న‌టించిన సంగ‌తి తెలిసిందే. త‌న‌పై ఇటీవ‌ల‌ జ‌రుగుతున్న ప్ర‌చారం నిజ‌మా కాదా? అన్న‌ది త‌నే చెప్పాల్సి ఉంటుంది.

బిజినెస్ మేన్ తో పెళ్లి నిజ‌మా?

బిజినెస్ మేన్ తో త్రిష పెళ్లి?

తెలుగు-త‌మిళ ప‌రిశ్ర‌మ‌ల్లో రెండు ద‌శాబ్ధాల పాటు స్టార్ డ‌మ్ ని కొన‌సాగించిన త్రిష ఇంత‌కుముందు బిజినెస్ మేన్ వ‌రుణ్ మ‌ణియ‌న్ ని పెళ్లాడేందుకు సిద్ధ‌మైన సంగ‌తి తెలిసిందే. కానీ ఆ పెళ్లి ర‌క‌ర‌కాల కార‌ణాల‌తో నిశ్చితార్థం త‌ర్వాత ఆగిపోవ‌డం త‌న అభిమానుల్ని బాధ‌కు గురి చేసింది. ఆ త‌ర్వాత త్రిష పెళ్లి ఊసే ఎత్త‌లేదు. కానీ అప్పుడ‌ప్పుడు త‌న పెళ్లి గురించిన‌ ర‌క‌ర‌కాల క‌థ‌నాలు వ‌స్తూనే ఉన్నాయి. హీరో శింబును త్రిష పెళ్లాడ‌తార‌ని కూడా ఇటీవ‌ల వార్త‌లు వ‌చ్చాయి.  కానీ అవేవీ నిజాలు కాలేదు. తెలుగు హీరో రానాతో ప్రేమాయ‌ణం అంటూ సాగిన పుకార్ల‌కు రానా.. త్రిష క్లారిటీ ఇచ్చారు. తాము స్నేహితులం మాత్ర‌మేన‌ని ప‌లుమార్లు తెలిపారు.

తాజాగా ఓ ప్ర‌ముఖ బిజినెస్ మేన్ ని పెళ్లాడేందుకు త్రిష సిద్ధ‌మ‌వుతున్నార‌ని కోలీవుడ్ వ‌ర్గాల్లో చ‌ర్చ న‌డుస్తోంది. అయితే అత‌డు ఎవ‌రు.. ఎక్క‌డ ఉంటారు? అన్న‌దానిపై స‌రైన క్లారిటీ లేదు. త్రిష వైపు నుంచి అధికారికంగా ఏదైనా చెబితేనే కానీ అప్ప‌టివ‌ర‌కూ అది కూడా రూమ‌ర్ గానే భావించాల్సి ఉంటుంది. త్రిష త‌మిళంలో వ‌రుస చిత్రాల్లో న‌టిస్తోంది. అందువ‌ల్ల పెళ్లి ప్ర‌య‌త్నాల‌పై వ‌స్తున్న క‌థ‌నాల్ని త‌నే స్వ‌యంగా ధృవీక‌రించాల్సి ఉంటుంది.
Tags:    

Similar News