ప్రత్యేక నిరసన సరసన సినీపరిశ్రమ
తమిళనాట యువతంతా ఏకఛట్రంపై నిలిచి మౌననిరసనతో జల్లికట్టుని తిరిగి గెలుచుకున్న తీరు అందరికీ ఆదర్శప్రాయంగా నిలిచింది. ప్రత్యేక రాష్ట్రం తరువాత ఆంధ్ర ప్రదేశ్ కి ప్రత్యేక హోదా ఇస్తామని మొండి చేయ చూపించిన పాలకులపై నిరసనగా వైజాగ్ లో ఈ జనవరి 26న తెలుగు రాష్ట్ర యువత మౌన నిరసనకి నడుం కడుతుంది.
ఈ నేపథ్యంలో యువత చేపట్టబోతున్న ఈ ఉద్యమానికి తమ సపోర్ట్ వుంటుందని ఇప్పటికే జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ తెలిపాడు. పవర్ స్టార్ అండతో యువత మరింత స్ఫూర్తితో ముందుకు సాగుతుంది. సినీ పరిశ్రమ నుండి సైతం ఈ ఉద్యమానికి ఉడతసాయం లభించనున్నట్టు తెలుస్తుంది.
ఈ ఉద్యమానికి అవసరమయ్యే పబ్లిక్ రిలేషన్ వ్యవహారాలూ - మంచినీటి సరఫరాలను శ్రేయాస్ మీడియా చూసుకోనుంది. యువహీరోలైన సందీప్ కిషన్ - అవసరాల శ్రీనివాస్ నిరసనలో భాగమవుతామని ఇప్పటికే తెలిపారు. ఇంకా మూడు రోజులు వ్యవధి వుండడంతో పెద్ద హీరోలు - దర్శకుల నుండి ఇలాంటి స్టేట్మెంట్స్ వినిపించే అవకాశాలు వున్నాయి. ఈ నిరసనకి మనవంతు సాయం మనమూ చేద్దాం.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/