థగ్స్ రియాక్షన్: సౌత్ డైరెక్టర్లను చూసుకోండి!

Update: 2018-11-10 10:02 GMT
థగ్స్ ఆఫ్ హిందూస్తాన్'. అమీర్ ఖాన్.. అమితాబ్ బచ్చన్.. కత్రీనా కైఫ్.. ఇది తారాగణం.  యాష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్..  బడ్జెట్ రూ. 300 కోట్లు.  ఇది చాలదా క్రేజ్ ఆకాశాన్ని తాకేందుకు? అమీర్ ఖాన్ అసలే ఒకదాన్ని మించి మరో బ్లాక్ బస్టర్లు ఇస్తున్నాడు కాబట్టి ఇది 'బాలీవుడ్ బాహుబలి' అంటూ ప్రచారం సాగింది. ఫైనల్ గా సినిమా నవంబర్ 8 న దీపావళి సందర్భంగా రిలీజ్ అయింది.  సినిమా మీద భారీ అంచనాలతో థియేటర్లకు వెళ్ళిన ప్రేక్షకులకు పెద్ద షాక్ తగిలింది.

మొదటి రోజు మార్నింగ్ షో పూర్తయిన వెంటనే సోషల్ మీడియాలో ట్రోలింగ్ స్టార్ట్ అయిపోయింది. మీమ్స్..బూతులు తిట్టే వీడియోలు సరేసరి.  ఇలాంటివాటిలో ఒక వీడియో వైరల్ మారింది.  థగ్స్ సినిమాను రూ. 500 టికెట్ పెట్టి కొన్న ఒక బాలీవుడ్ ఫ్యాన్ ఫ్రస్ట్రేట్ అయ్యాడు.  తిట్టడం మొదలు పెట్టాడు.  రూ.300 కోట్లు ఖర్చు పెట్టి ఇలాంటి చెత్త సినిమా తీస్తారా? అంటూ మండి పడ్డాడు.  మంచి కథను.. అమీర్ ఖాన్.. అమితాబ్ లాంటి నటులను.. భారీ బడ్జెట్ ను వేస్ట్ చేసుకున్నందుకు  దర్శకుడు విజయ్ కృష్ణ ఆచార్యను ఏకి పారేశాడు.  వీళ్ళకు డైరెక్షన్ రాదని..  అమీర్ ఖాన్ లాంటి స్టార్ హీరోలు సౌత్ డైరెక్టర్లను ఎంచుకోవాలని అన్నాడు.  సౌత్ డైరెక్టర్లు మంచి కాన్సెప్ట్ లతో వస్తారని వారి ఎగ్జిక్యూషన్.. డైరెక్షన్ చాలా బాగుంటుందని అన్నాడు.

అంతే కాదు ఈ థగ్స్ ను బాహుబలి తో పోల్చిన వారిని బండబూతులు తిట్టాడు.  బాహుబలి ఎక్కడ.. ఈ చెత్త సినిమా ఎక్కడ? ఈ సినిమాకు నన్ను రేటింగ్ ఇవ్వమంటే 'మైనస్ 1 టు ది పవర్ ఆఫ్ యూనివర్స్' ను ఇస్తానని అన్నాడు.  ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ కావడం విశేషం.


వీడియో కోసం క్లిక్ చేయండి 1

వీడియో కోసం క్లిక్ చేయండి 2
Tags:    

Similar News