అంచనాలు లేని సమ్మర్ పోటీ!!

Update: 2018-05-21 17:09 GMT
సమ్మర్ హాలిడేస్ లో సినిమాల సందడి ఎలా ఉంటుందో అందరికి తెలిసిందే. వరుసగా ఎన్ని సినిమాలు రిలీజ్ అయినా కూడా జనాలకు నచ్చితే చూసేస్తారు. కొంచెం పాజిటివ్ టాక్ వచ్చింది అంటే చాలు బాక్స్ ఆఫీస్ హిట్ అయినట్టే. రంగస్థలం తో స్టార్ట్ అయినా బాక్స్ ఆఫీస్ బొనాంజా మహానటి వరకు బాగానే నడిచింది. సూపర్ స్టార్ మహేష్ బాబు భరత్ అనే నేను కూడా వసూళ్లను బాగానే అందుకోని హిట్ టాక్ తెచ్చుకుంది.

ఇకపోతే మరికొన్ని రోజుల్లో నాలుగు సినిమాలు ఒకే రోజున పోటీ పడటానికి సిద్ధమయ్యాయి. జూన్ 1న నా నువ్వే - ఆఫీసర్ అలాగే అభిమన్యుడు - రాజుగాడు సినిమాలు విడుదల కానున్నాయి. ఈ నాలుగు సినిమాలు ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ కానున్నాయి. కళ్యాణ్ రామ్ - నా నువ్వే అసలైతే ఈ శుక్రవారమే రిలీజ్ కావాలి గాని ఎందుకో తేదీని షిఫ్ట్ చేశారు. ఈ వారం కేవలం రవితేజ - నేల టిక్కెట్టు నాగ శౌర్య - అమ్మమ్మ గారి ఇల్లు మాత్రమే మే 25న రిలీజ్ కానున్నాయి.

దాదాపు అన్ని సినిమాలు విడుదల అయ్యే వరకు ఎలా ఆడతాయో చెప్పలేని పరిస్థితి. ట్రైలర్ లు సాంగ్స్ రిలీజ్ చేసినా పెద్దగా కొత్తదనం ఏమి అనిపించలేదు. ఎర్రటి ఎండలో బయటకు వచ్చి సినిమా థియేటర్స్ వరకు వెళ్లాలంటే సినిమా నిరాశపరచకూడదు. సినిమా మొదటి టాక్ ను బట్టి ఇప్పుడు విడుదల కాబోయే సినిమాల బాక్స్ ఆఫీస్ స్టామినా ఏంటో తెలుస్తుంది. చూడాలి మరి ఏమవుతుందో..? 
Tags:    

Similar News