వారెవ్వా వందకోట్ల బాహుబలి

Update: 2015-08-03 14:44 GMT
తెలుగు సినిమా సంచలనంగా పేరుగాంచిన బాహుబలి బలిష్టమైన ప్రదర్శనకి రికార్డులన్నీ అప్పడాల కన్నా తేలిగ్గా విరిగిపోతున్నాయ్.. కాగితాలకన్నా ఈజీగా చిరిగిపోతున్నాయ్. రోజుకొక రికార్డుని బ్రద్దలుకొడుతూ రోజూ రికార్డులలో నిలుస్తున్న ఈ సినిమా ఇప్పుడు ప్రపంచం నలుమూలలా ఖ్యాతిని గడిస్తుంది.

తాజాగా ఈ సినిమా హిందీ వెర్షన్ ఒక్కటే 100కోట్లను కలెక్ట్ చేసింది. ప్రముఖ సినీ విమర్శకుడు తరన్ ఆదర్శ్ స్వయంగా ఈ విషయాన్ని ప్రకటించడం విశేషం. ఇతర ప్రాంతీయ సినిమా బాలీవుడ్ లో ఈ స్థాయి కలెక్షన్లు సాధించడం అద్భుతమని పేర్కొన్నాడు. శంకర్ రోబో సినిమాను దాటి బాహుబలి తన సత్తా చాటిన విషయం తెలిసినదే. హిందీలో బాహుబలికి సల్మాన్ భాజరంగీ నుండి గట్టి పోటీ ఎదురైనా దాన్ని తట్టుకుని నిలిచిందంటే సినిమా సత్తా ఏంటో అర్ధం చేసుకోవచ్చు.
Tags:    

Similar News