టాలీవుడ్లో ఏ అభిప్రాయాన్నయినా ముక్కుసూటిగా చెప్పే పెద్దల్లో తమ్మారెడ్డి భరద్వాజ ఒకరు. తనకు నచ్చిన సినిమా అయినా చిన్నదైనా.. నచ్చని సినిమా పెద్దదైనా మొహమాటం లేకుండా తన అభిప్రాయం చెబుతారాయన. ఇప్పుడాయన ఓ చిన్న సినిమా మీద ప్రశంసల జల్లు కురిపించారు. ఆ సినిమానే ‘అప్పట్లో ఒకడుండేవాడు’.
ఏడాది చివర్లో చడీచప్పుడు లేకుండా రిలీజైన ఈ సినిమా అందరి ప్రశంసలందుకుంటోంది. తమ్మారెడ్డి కూడా ఈ సినిమా చూసి ముగ్ధుడైపోయాడట. చాలా మంచి కథ.. కొత్త తరహా స్క్రీన్ ప్లే తో ఈ సినిమా తనను కట్టిపడేసిందని ఆయనన్నారు. ఈ తరానికి తగ్గ సినిమా ఇదని.. ఇలాంటి మంచి సినిమాను అందరూ తప్పక చూడాలని ఆయన అన్నారు.
మరోవైపు బాలీవుడ్ మూవీ ‘దంగల్’ మీద కూడా ఆయన ప్రశంసల జల్లు కురిపించారు. మామూలుగా కొన్ని సినిమాలు ఎంటర్టైన్మెంట్ ఇస్తాయని.. ఇంకొన్ని సినిమాలు ఇన్ స్పైర్ చేస్తాయని.. ఇంకొన్ని సినిమాలు ఎక్స్ పీరియన్స్ ఇస్తాయని.. ఈ మూడూ కలిపితే దంగల్ అని ఆయన ప్రశంసించారు. ఈ సినిమాలో అమీర్ ఎక్కడా కనిపించడని.. అంతటా పాత్రే కనిపిస్తుందని ఆయనన్నారు. సినిమా చూస్తున్నంతసేపూ వేరే ఆలోచన లేకుండా ప్రేక్షకులు ఇన్వాల్వ్ అయ్యేలా ఈ చిత్రాన్ని రూపొందించారన్నారు. ఇలాంటి సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులకు ఆయన అభినందనలు తెలిపారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/