తమిళ్ లో కూడా అదే పాత్ర పట్టేసిన తమ్మూ

Update: 2017-05-18 05:01 GMT
ఆరేళ్ క్రితం తెలుగులో సెన్సేషనల్ హిట్ సాధించన మూవీ 100% లవ్. నాగ చైతన్య- తమన్నా జోడీగా నటించగా.. సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ ఘన విజయం సాధించింది. అందరి కెరీర్ లోను ఓ మైలురాయిగా నిలిచిపోయింది.

ఇప్పుడీ సినిమాను తమిళ్ లో రీమేక్ చేయాలని నిర్ణయించారు. తమిళ్ 100% లవ్ చిత్రానికి ఇంకా టైటిల్ డిసైడ్ చేయలేదు కానీ.. హీరో హీరోయిన్ పాత్రలపై మాత్రం ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది. నాగ చైతన్య నటించిన బాలు రోల్ లో.. తమిళ యంగ్ హీరీ జీవీ ప్రకాష్ నటించబోతున్నాడు. ఇక మహాలక్ష్మిగా తన నటనలోని ప్రతిభతో పాటు అందాలను ముద్దుగా చూపించిన తమన్నా.. కోలీవుడ్ లో కూడా ఈ పాత్రను తానే చేయనుండడం విశేషం. ఇక దర్శకుడి విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు కానీ.. తమిళ్ వెర్షన్ ను కూడా సుకుమార్ దర్శకత్వం వహించే ఛాన్స్ ఉందని అంటున్నారు.

ఇక సంగీత దర్శకుడి విషయంలో కూడా ఇంకా స్పష్టత రాలేదు. సహజంగా తన సినిమాలకు తానే మ్యూజిక్ ఇచ్చుకుంటాడు జీవీ ప్రకాష్. కానీ 100% లవ్ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం పెద్ద అస్సెట్. మరి తమిళ్ వెర్షన్ కు ఏం జరగనుందో చూడాలి. అయితే.. ఆరేళ్ల క్రితం నాటి తెలుగు 100%లవ్ కు.. ఈ ఏడాది చివరకు ప్రారంభమయ్యే కోలీవుడ్ రీమేక్ కు కొన్ని కీలక మార్పులు ఉంటాయని తెలుస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News