తమన్నా సరికొత్తగా ఉందే!

Update: 2018-12-05 04:44 GMT
'బాహుబలి' లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తగిలిన తర్వాత సహజంగా ఎవరి రేంజ్ అయినా ఆకాశాన్ని తాకాలి. కానీ మిల్కీ బ్యూటీ తమన్నా విషయంలో మాత్రం అలాంటి దేమీ జరగలేదు.  నిజం మాట్లాడుకుంటే 'బాహుబలి: ది బిగినింగ్' విజయంతో తమన్నాకు పెద్దగా ప్రయోజనం కలగలేదు.  కొత్తగా పెద్ద పెద్ద ఆఫర్లేమీ రాకపోయినా తన టాలెంట్ తో ఎప్పుడూ తెచ్చుకునే ఆఫర్లతోనే కెరీర్ లో ముందుకు దూసుకెళ్తూ ఉంది.

తమన్నా తాజాగా 'నెక్స్ట్ ఏంటి' అనే సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకొస్తోంది.  బాలీవుడ్ దర్శకుడు కునాల్ కోహ్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న  ఈ సినిమాలో తమన్నా కీలక పాత్ర పోషిస్తుండగా సందీప్ కిషన్.. నవదీప్ లు ఇద్దరూ ఇతర ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాలో తమన్నా మోడరన్ జనరేషన్ అమ్మాయిలా కనిపిస్తోంది.  'నెక్స్ట్ ఏంటి' లో ఓ నో నెవర్.. అంటూ సాగే పాట ఇప్పటికే మ్యూజిక్ లవర్స్ ను ఆకర్షిస్తోంది .  ఈ ఒక క్యాసనోవా లాంటి అబ్బాయి లవ్ లో పడినా దూరంగా పెడుతూ ఉన్న అమ్మాయి.. ఆమె బాయ్ ఫ్రెండ్ ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉన్నట్టుగా సాగే పాట ఇది.

ఒక వారం క్రితం విడుదల చేసిన ఓ నో నెవర్ వీడియో సాంగ్ లో తమన్నా చాలా లైవ్లీగా లవ్లీగా కనిపించింది. చిట్టి పొట్టి గౌనుల్లో సందీప్ తో కలిసి లండన్ వీధుల్లో అల్లరి చేస్తూ ఉంది. కలర్ఫుల్  లొకేషన్స్.. మంచి సినిమాటోగ్రఫీ తోడవడంతో పాట ఆడియన్స్ కు ఫుల్ గానే కనెక్ట్ అయింది.  యూట్యూబ్ లో ఈ పాటకు ఆరు లక్షలకు పైగా వ్యూస్ రావడం విశేషం. 'ఫనా' ఫేమ్ కునాల్ కోహ్లి ఈ సినిమాకు దర్శకుడు కాబట్టి మిల్కీ బ్యూటీకి ఈ సినిమాతో ఓ మాంఛి హిట్టు అందిస్తాడేమో వేచి చూడాలి. 

Full View
Tags:    

Similar News