ఆ ఎడల్ట్ సీన్ ఎలా తీశారంటే..

Update: 2018-06-08 16:38 GMT
ప్రస్తుతం బాలీవుడ్ లో వీరే ది వెడ్డింగ్ సినిమా మంచి కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. కరీనా కపూర్ - సోనమ్ కపూర్ ప్రధాన పాత్రల్లో కనిపించిన ఆ సినిమాలో స్వరభాస్కర్ - శిఖా తల్సానియా కూడా కూడా స్పెషల్ రోల్స్ లో కనిపించారు. ఇకపోతే ప్రస్తుతం సినిమాకు అన్ని ఏరియాల నుంచి మంచి రెస్పాన్స్ అందుతోంది. చూస్తుంటే 100 లోట్లను అందుకునేలా ఉంది. మొదటి వారమే 30 కోట్ల గ్రాస్ అందుకుంది.

ఇకపోతే ఈ సినిమాలో ఒక సీన్ గురించి ప్రతి ఒక్కరు చర్చించుకోవడం ఇప్పుడు వైరల్ అయ్యింది. ముఖ్యంగా స్వరభాస్కర్ కు సంబందించిన సిన్ అయితే హాట్ టాపిక్ గా మారింది. ఆమె హస్త ప్రయోగం (మాస్టర్బేషన్) చేసుకోవడం హైలెట్ గా నిలిచింది. ఒక సీన్ లో కసిగా ఏ మాత్రం సిగ్గు పడకుండా నటించిన తీరుకు కుర్రకారు కూడా షాక్ అయ్యారు. అయితే ఈ సిన్ లో నటించడానికి అమ్మడు ఒక కండిషన్ పెట్టిందట.  ముందుగా సీన్ గురించి చెప్పగానే ఛాలెంజ్ గా తీసుకొని స్వరభాస్కర్ క్లోజ్ సెట్ వేయమని చెప్పిందట. అంటే చుట్టూ ఎక్కువగా టీమ్ ఎవరు ఉండకూడదని కేవలం అవసరం అయిన వారు మాత్రమే ఉండమని చెప్పి.. ఈ ఎడల్ట్ సీన్ కోసం అమ్మడు మూడు టేక్ లు తీసుకుందట. ఇక అందులో నుంచి ఓక సీన్ ను చిత్ర యూనిట్ ఫైనల్ చేసుకుంది.

నిజానికి అలాంటి అడల్ట్ సీన్ చేయడం అంటే నిజంగా సాహసమనే చెప్పాలి.   అందుకే ఈ సీన్ పై పెద్ద దుమారం చెలరేగుతోంది. ఇకపోతే ఈ సీన్లో ఏముంది అని ఎవరైనా అడిగితే.. అందులో సెక్యుయాలిటీ అండ్ ఉమెన్ ఎంపవర్మెంట్ ఉందంటూ స్వర క్లాసులు పీకేస్తోంది. అది సంగతి.


Tags:    

Similar News