విజయ్ 'ఫైటర్‌' మూవీలో మరో స్టార్‌

Update: 2020-11-25 13:30 GMT
విజయ్‌ దేవరకొండ హీరోగా పూరి జగన్నాద్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ఇప్పటికే ముంబయిలో ప్రారంభం అయ్యి కీలక సన్నివేశాల చిత్రీకరణ పూర్తి చేసుకుంది. సినిమా లాక్‌ డౌన్‌ తో గత 9 నెలలుగా పునః ప్రారంభం కాలేదు. త్వరలోనే షూటింగ్‌ కు ఏర్పాట్లు చేస్తున్నారు. రమ్యకృష్ణ కీలక పాత్రలో కనిపించబోతున్న ఈ సినిమాలో మరో స్టార్‌ నటుడు సురేష్‌ గోపిని నటింపజేయాలని పూరి భావిస్తున్నాడు. తెలుగులో సురేష్‌ గోపీ సుపరిచతుడు అనే విషయం తెల్సిందే. పూరి సినిమాలు అంటేనే చాలా ప్రత్యేకంగా ఉంటాయి. ప్రతి పాత్ర కూడా విభిన్నంగా ఆకట్టుకునే రీతిలో ఉంటాయి.

దర్శకుడు పూరి ఒక పవర్‌ ఫుల్‌ పాత్ర కోసం సురేష్‌ గోపీని ఎంపిక చేశారని తెలుస్తోంది. దర్శకుడు పూరి ఈ సినిమా ను వచ్చే సమ్మర్‌ వరకు పూర్తి చేసేలా ప్లాన్‌ చేస్తున్నారు. షూటింగ్‌ కు సంబంధించిన అప్‌ డేట్‌ ఏమీ ఇవ్వక పోవడంతో సైలెంట్‌ గా ప్రారంభం అయ్యిందనే ప్రచారం కూడా జరుగుతుంది. ఏం జరుగుతుంది అనేది పూరి కాని విజయ్‌ కాని చార్మి కాని స్పందించాల్సి ఉంది. తెలుగుతో పాటు ఏక కాలంలో హిందీలో కూడా రూపొందుతున్న ఈ సినిమాను అక్కడ కరణ్‌ జోహార్‌ సమర్పించబోతున్నాడు. విజయ్‌ కి జోడీగా బాలీవుడ్‌ ముద్దుగుమ్మ అనన్య పాండే నటిస్తున్న విషయం తెల్సిందే.
Tags:    

Similar News