'అసురన్' రీమేక్ లో అభిరామ్... క్లారిటీ ఇచ్చిన సురేష్ బాబు

Update: 2019-12-09 09:55 GMT
అప్పుడెప్పుడో దగ్గుబాటి అభిరామ్ హీరోగా సినిమా లాంచ్ అంటూ హంగామా జరిగింది. ఎందుకో దగ్గుబాటి కుర్ర హీరోకి ఏది సెట్ అవ్వలేదు. కట్ చేస్తే శ్రీ రెడ్డి ఇష్యూ తో కొన్ని నెలలు బయటికి కనబడలేదు.

ఇక ఇన్నాళ్లకు అభిరామ్ యాక్టింగ్ డెబ్యూ అంటూ ఓ వార్త చక్కర్లు కొట్టింది. త్వరలో తమిళ్ బ్లాక్ బస్టర్ 'అసురన్' ను వెంకటేష్ రీమేక్ చేయబోతున్నాడు. అందులో వెంకటేష్ చిన్న కొడుకుగా అభిరామ్ నటిస్తాడనేది ఆ వార్త. ఆల్మోస్ట్ ఇది ఫిక్స్ అని దగ్గుబాటి ఫ్యాన్స్ కి కూడా సంకేతాలు వెళ్లాయి. కట్ చేస్తే ఎందుకో వద్దనుకున్నారు.

లేటెస్ట్ గా ఈ విషయంపై సురేష్ బాబు స్పందించాడు. అలాంటిదేమి లేదంటూ అభిరామ్ యాక్టింగ్ డెబ్యూ వార్తను కొట్టిపారేశారు. ప్రస్తుతం అభి యాక్టింగ్ లో ట్రైనింగ్ అవుతున్నాడని చెప్పాడు. అయితే ఎక్కడ ట్రైనింగ్ తీసుకుంటుంది మాత్రం చెప్పలేదు. సో 'అసురన్'లో అభిరామ్ లేనట్టే.
Tags:    

Similar News