అందరికీ మూడు.. ఎన్టీఆర్ కు రెండు
అసలు ఎన్టీఆర్ ను పొగడకుండా ఉండలేకపోతున్నాడు సుక్కూ. ఇంకా రిలీజ్ కు మరొకొన్ని గంటలే ఉండటంతో.. నాన్నకు ప్రేమతో విశేషాలు పంచుకుంటూ.. అసలు ఎన్టీఆర్ ఎనర్జీ గురించి ఓ రేంజులో వివరించాడు. పైగా నందమూరి వంశంలో పుట్టి ఉండకపోతే వరల్డ్ హీరో అయ్యేవాడని హితవు కూడా పలికాడు.
''ఎవరైనాఒక విషయంలో మూడు ప్రాసెస్ లు ఫాలో అవ్వాల్సిందే. ఒకటి విషయం తెలుసుకోవడం, రెండోది నేర్చుకోవడం, మూడోది దాన్ని ఇంప్లిమెంట చేయడం. కానీ తారక్ విషయంలో రెండు స్టేజ్ లే కనపడతాయి. విషయం తెలుసుకోవడం, ఇంప్లిమెంట్ చేయడం. ఇలా చేయడం వల్ల తనకు చాలా టైమ్ కలిసి వస్తుందని కూడా అనుకోవచ్చు. ఎందుకంటే నేర్చుకోవడమనే ప్రాసెస్ ఉండకపోవడం తనకు బాగా కలిసి వస్తుంది'' అంటూ చెప్పుకొచ్చాడు సుక్కూ. డ్యాన్సు స్టెప్పయినా, డైలాగ్ బిట్ అయినా, ఏదైనా డిఫరెంట్ ఎమోషన్ అయినా.. ఇలా చూస్తే అలా పట్టేసి వెంటనే చేసి చూపించేస్తాడట.
''నందమూరి వంశంలో పుట్టడం వల్ల హీరో అయ్యాడు. ఒకవేళ పుట్టకపోయుంటే ఏదో ఒకటి కనిపెట్టి వరల్డ్ హీరో అయ్యుండేవాడు'' అంటూ భారీ స్టేట్మెంటే ఇచ్చాడు సుకుమార్. మొత్తానికి యాక్టర్ ఎన్టీఆర్ ను ఒక ఇన్వెంటర్ ఎన్టీఆర్ గా చూసేవాళ్లం అంటున్నాడు సుక్కూ. మరి సినిమాలో అలాగే చూపించాడా ఏంటి ఒకవేళ? వెయిట్ అండ్ సి.