హీరోయిన్ల విషయంలో మణి బాగా లక్కీ

Update: 2017-03-22 08:14 GMT
కట్టుకున్న భార్య కూడా ఆల్రెడీ హీరోయినే. కాని ఆవిడ కాస్త సెటైరికల్. ఎప్పుడూ ఏదో ఒక రకంగా ఈకలు పీకుతూనే ఉంటుంది. ఇదంతా తనకు తానుగా చెప్పుకుంది మాజీ హీరోయిన్ సుహాసిని. ఈమె ప్రముఖ దర్శకుడు మణిరత్నం భార్య అనే సంగతి తెలిసిందే. తన భర్తకు ఎప్పుడూ తాను మాంచి హీరోయిన్ మాత్రం కాదంటోంది.

''ఎప్పుడూ నేను ఆయనపై ఆయన సినిమాలపై సెటైర్లు వేస్తూనే ఉంటాను. ఆడియన్స్ నుండి పొగడ్తల వర్షం కురుస్తుందమో కాని.. నా నుండి మాత్రం అన్నీ విమర్శలే'' అంటూ చెప్పింది సుహాసిని. అయితే ఇప్పుడు తన భర్త తీస్తున్న ''చెలియా'' సినిమా విషయంలో మాత్రం ఒక పాజిటివ్ విషయం జరిగిదంట. ''గడిచిన 20 ఏళ్ళలో నేను ఇంత అందమైన హీరోయిన్ ను ఎవ్వరినీ చూడలేదు. అదితి రావ్ హైదారి అంత బాగుంది. మా ఆయనకు మంచి వైఫ్‌ దొరకలేదు కాని.. కత్తిలాంటి హీరోయిన్లు మాత్రం దొరుకుతారు. ఆ విషయంలో మణి చాలా లక్కీ'' అంటూ ఛమత్కరించింది.

మొత్తానికి తన భర్త సినిమాను ప్రమోట్ చేయడానికి మాంచి గ్రాస్పింగ్  అండ్ మసాలా బాగానే చేస్తోంది సుహాసినీ. గతంలో రూమర్ల గురించి భారీ అవాకులూ చివాకులూ పేల్చిన ఈ సీనియర్ సుందరి.. ఇప్పుడు చెలియా సినిమా కోసం తను కూడా మసాలా దారినే ఎన్నుకోవడం హాట్ టాపిక్ గా మారింది. అంతేలేండి.. అవసరం ఏదైనా చేయిస్తుంది.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News