తెలుగు తెరపై ఆ తండ్రీకొడుకులు కూడా..

Update: 2017-03-27 11:14 GMT
నందమూరి తారకరామారావు-బాలకృష్ణ.. అక్కినేని నాగేశ్వరరావు-నాగార్జున.. మంచు మోహన్ బాబు-విష్ణు.. మోహన్ బాబు-మనోజ్.. మెగాస్టార్ చిరంజీవి-చరణ్.. ఇలా తెలుగుతెరపై చాలా తండ్రీ కొడుకుల కాంబినేషన్లు చూశాం. వీటిలో కొన్ని జంటలు పూర్తి స్థాయి పాత్రలతో అలరించాయి. కొన్ని కాంబినేషన్లలో అతిథి పాత్రలతో తళుక్కుమన్నారు. ఇప్పుడు తెలుగు తెరపై మరో ఫాదర్-సన్ కాంబో చూడబోతున్నాం. సీనియర్ నటుడు శ్రీకాంత్.. తన కొడుకు రోషన్ తో కలిసి నటించబోతున్నట్లు సమాచారం. తండ్రి బాటలో నటనలోకి వచ్చిన రోషన్.. టీనేజీలోనే ‘నిర్మలా కాన్వెంట్’లో హీరోగా నటించాడు. ఐతే ఈ చిత్రం అతడికి తీవ్ర నిరాశను మిగిల్చింది.

దీంతో కొంచెం గ్యాప్ తీసుకుని ఈసారి టీనేజ్ లవ్ స్టోరీలా కాకుండా మామూలు సినిమానే చేయాలనుకుంటున్నాడు రోషన్. ఈ చిత్రంలో శ్రీకాంత్ కూడా కీలక పాత్ర పోషిస్తాడట. ఇందుకోసం ప్రస్తుతం స్క్రిప్టు రెడీ చేయించే పనిలో ఉన్నాడట శ్రీకాంత్. హీరోగా కెరీర్ బాగా దెబ్బ తిన్నాక శ్రీకాంత్ క్యారెక్టర్ రోల్స్ చేస్తూ మెప్పిస్తున్నాడు. గత ఏడాది ‘సరైనోడు’లో ఆయన పాత్ర సినిమాకు బాగానే ఉపయోగపడింది. కొడుకు సినిమాలోనూ అలాంటి కీలకమైన పాత్రే చేయాలనుకుంటున్నాడు శ్రీకాంత్. ఐతే ‘నిర్మలా కాన్వెంట్’ దెబ్బ తిన్న నేపథ్యంలో ఈసారి మామూలు సినిమాతో వస్తే సరిపోదు. మంచి రేంజ్ ఉన్న సినిమానే చేయాలి. లేదంటే రోషన్ హీరోగా నిలదొక్కుకోవడం కష్టమవుతుంది.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News