సెక్స్ బాంబ్.. సన్యాసిని అయిపోయింది

Update: 2016-05-24 06:00 GMT
సోఫియా హయత్.. ఈ అమ్మాయిని కాస్త నిండైన బట్టలతో చూస్తే జనాలు గుర్తు పట్టడం కష్టం. ఎందుకంటే ఎప్పుడు చూసినా అర్ధనగ్నంగా.. అప్పుడప్పుడూ నగ్నంగా కెమెరాలకు పోజులివ్వడం ఈ అమ్మడికి అలవాటు. స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ నిజంగా ఈమెతో ఎఫైర్ నడిపాడో లేదో కానీ.. ఆమె మాత్రం అతను తన బాయ్ ఫ్రెండ్ అని బాగానే ప్రచారం చేసుకుంది. రోహిత్ డబుల్ సెంచరీ చేసినపుడు.. అందుకో నా కానుక అంటూ న్యూడ్ ఫొటో షూట్ కూడా చేసింది. సినిమాల్లో పెద్దగా అవకాశాలు లేకపోయినా.. పూనమ్ పాండే.. షెర్లీన్ చోప్రాల బాటలో సెక్సీ ఫొటో షూట్లతోనే నెట్టుకుంటూ వచ్చిన సోఫియా ఇప్పుడు ఉన్నట్లుండి సన్యాసినిగా మారిపోవాలని నిర్ణయం తీసుకోవడం విశేషం.

ఆమెలో ఎవరు ఇలా మార్పు తెచ్చారో ఏంటో కానీ.. ఉన్నట్లుండి బౌద్ధ సన్యాసినిగా మారిపోయి తెల్లటి దుస్తులు ధరించి బుద్ధుడికి నమస్కారం చేస్తూ ఫొటోలకు పోజులిచ్చింది సోఫియా. అంతే కాదు.. అడిగిన వాళ్లకు, అడగని వాళ్లకు ఆధ్యాత్మిక సలహాలిస్తూ ఆశ్చర్యపరుస్తోంది. ఇన్నాళ్లూ సోఫియాను అంత సెక్సీగా చూసి.. ఉన్నట్లుండి ఆమెనిలా నిండైన దుస్తుల్లో చూసి జనాలు అసలు పోల్చుకోలేకపోతున్నారు. ఒకప్పుడు బూతు నవలలు రాసిన మల్లాది వారు.. ఉన్నట్లుండి ఆధ్యాత్మిక పుస్తకాల రచనకు దిగినట్లు సోఫియాలో ఇలాంటి మార్పు రావడం ఆశ్చర్యకరమే.
Tags:    

Similar News