కేన్స్ లో పద్ధతిగా శృతి చేసింది

Update: 2017-05-21 07:45 GMT
ఇప్పుడు ఫ్యాషన్ ప్రపంచం అంతా కేన్స్ చుట్టూనే తిరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా అనేక మంది అందగత్తెలు కేన్స్ లో కొలువుదీరి తమ అందాలను ఆరబోసేస్తున్నారు. సౌత్ బ్యూటీ శృతి హాసన్ కూడా కేన్స్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో సందడి చేసింది.

శృతి హాసన్ ప్రధాన పాత్రలో రూపొందనున్న భారీ బడ్జెట్ మూవీ సంఘమిత్ర లాంఛింగ్ కోసం.. టీం అంతా కేన్స్ లో హంగామా చేసినా.. శృతి అందాల ఆరబోత.. స్టైలింగ్ హాట్ టాపిక్ అవుతున్నాయి. ఎప్పటికప్పుడు ట్రెండీ డ్రెస్సులతో ఆకట్టుకునే ఈ అందగత్తె.. కేన్స్ లాంటి ఫ్యాషన్ ఎగ్జిబిషన్ ఈవెంట్ కి.. మరింతగా మెరిసిపోతూ హాజరైంది. రెడ్ కార్పెట్ పై నడిచినపుడు బ్లాక్ అండ్ గోల్డ్ డ్రెసింగ్ లో కొత్త మెరుపులను ఒలికిస్తే.. అంతకు ముందే సొగసులు చిందించేసింది. కేన్స్ ఈవెంట్ సందర్భంగా ముందు రోజు నుంచి మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వడం ఆనవాయితీ.

రెడ్ కార్పెట్ పై నడిచే స్టైలింగ్ కి ఏ మాత్రం తగ్గకుండా ఇక్కడ కూడా మెరుస్తూ ఉంటారు. ఓ సారి వైట్ కలర్ పై ఫ్లవర్ డిజైన్ లో కాసింత పద్ధతి గాను.. మరోసారి డిజైనర్ బ్లాక్ వేర్ లో అల్ట్రా మోడర్న్ గాను శృతి తయారైంది. సంఘమిత్ర కోసం స్కెచెస్ తో ఉత్తుత్తిగా ఊరిస్తే.. తన మెరుపుల అందాలతో నిజంగానే కవ్వించేసింది శృతి హాసన్.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News