డబ్బింగ్‌, సింగింగులో ఛాన్సులివ్వరేం?

Update: 2015-08-01 09:40 GMT
ప్రతిభలో విలక్షణ నటుడు కమల్‌ హాసన్‌ నే మించిపోతోంది శ్రుతిహాసన్‌. తండ్రిని మించిన తనయ అనిపించుకుంటోంది. ఈ భామ ఆరంభం సంగీతదర్శకురాలిగా నిరూపించుకోవాలనుకుంది. ఓ రాక్‌ బ్యాండ్‌ బృందాన్ని కూడా తయారు చేసింది. అయితే విధి వైచిత్రి అనుకోవాలేమో.. అనూహ్యంగా కథానాయిక అయ్యింది. ఇప్పుడు ఏకంగా స్టార్‌ హీరోయిన్‌ అయిపోయింది.

తమిళ్‌ మాతృభాష అయినా హిందీ, తెలుగు భాషల్ని చక్కగా మాట్లాడగలదు శ్రుతి. నటీమణుల్లో బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరు తెచ్చుకుంది. పాటలు పాడగలదు, సంగీతం అందించగలదు. నటించగలదు .. ఇంకా ఎన్నో క్వాలిటీస్‌ శ్రుతిలో ఉన్నాయి. అయితే వాటన్నిటినీ సంతృప్తి పరిచే గొప్ప అవకాశాలు ఒకే వేదికపై రావడం లేదన్నది వాస్తవం. అయితే ఈ భామ అప్పుడప్పుడు తను నటించిన సినిమాలకు పాటలు పాడుతోంది. అయితే పూర్తిగా సింగర్‌ కాలేకపోయింది. అలాగే అన్ని భాషలు తెలుసు కాబట్టి డబ్బింగ్‌ చెప్పుకునే అవకాశం ఉంది. కానీ ఎవరూ ఇవ్వడం లేదు. ఇదే విషయంపై అమ్మడిని ప్రశ్నిస్తే .. అవును ఆ మాట నా దర్శకనిర్మాతల్నే అడగండి. నాకు ఎందుకు పాడే, మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదో? మీరే అడగండి.

శ్రుతితో ఎందుకు డబ్బింగ్‌ చెప్పించడం లేదు? శ్రీమంతుడు లో పాడే అవకాశం ఎందుకు ఇవ్వలేదని దేవీని, కొరటాలని ప్రశ్నించండి అంటూ చాలా తెలివిగా ఛమక్కు విసిరింది. శ్రుతిహాసన్‌ కథానాయికగా నటించిన 'శ్రీమంతుడు' ఈనెల 7న రిలీజవుతోంది.
Tags:    

Similar News