'2.0' ఫ్యాన్ థియరీలపై శంకర్ షాక్

Update: 2018-09-30 04:23 GMT
ఇంతకుముందు ‘బాహుబలి: ది బిగినింగ్’ సినిమా రిలీజైన కొన్ని రోజులకే ‘బాహుబలి: ది కంక్లూజన్’ కథ ఇదీ అంటూ రకరకాల ప్రచారాలు మొదలయ్యాయి. జనాలు తమ క్రియేటివిటీ అంతా చూపిస్తూ పెద్ద పెద్ద సైజుల్లో కథలు కూడా తయారు చేసేశారు. అవి ట్విట్టర్.. ఫేస్ బుక్.. వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ అయ్యాయి. ఇలా జనాలు అంచనాలు వేసిన విషయాల్లో కొన్ని ‘ది కంక్లూజన్’లో కనిపించాయి కూడా. ఇప్పుడు ‘2.0’ విషయంలోనూ ఇలాంటి ఆసక్తే కనిపిస్తోంది. ఈ సినిమా మొదలైనప్పట్నుంచి ఇందులో రజనీ పాత్ర గురించి.. అక్షయ్ కుమార్ క్యారెక్టర్ గురించి.. అలాగే సినిమా కథ గురించి రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి.

ఐతే ఈ ప్రచారాలు తన వరకు కూడా వచ్చాయని శంకర్ చెప్పడం విశేషం. ‘2.0’ కథ ఇదే అంటూ సోషల్ మీడియాలో అభిమానులు షేర్ చేసిన స్టోరీల్లో కొన్ని తాను కూడా చదివానని శంకర్ వెల్లడించాడు. అందులో కొన్ని తన కథలోని అంశాలకు దగ్గరగా ఉండటం చూసి సంతోషించా అన్నాడు. అలాగే కొన్ని అంశాలు చూసి ఆశ్చర్యపోయానన్నాడు. మనం కూడా ఇంత బాగా.. క్రియేటివ్ గా ఆలోచించలేదే.. భలే రాశారే అనిపించిందని శంకర్ చెప్పాడు. ఐతే అభిమానుల కథల్లో ఏవి తన కథతో మ్యాచ్ అయ్యాయన్నది వెల్లడించడానికి శంకర్ ఇష్టపడలేదు. ఈ చిత్రంలో అక్షయ్ కుమార్ బర్డ్ మ్యాన్ గా కనిపిస్తాడని.. అతడి పేరు డాక్టర్ రిచర్డ్ అని వస్తున్న ఊహాగానాలు నిజం కాదని మాత్రం శంకర్ చెప్పాడు. కథాకథనాల గురించి కానీ.. పాత్రల గురించి కానీ తాను ఇంతకుమించి ఏమీ చెప్పనని.. ఇంకో రెండు నెలలు ఆగి సినిమా చూడండని సింపుల్ గా తేల్చేశాడు శంకర్.
Tags:    

Similar News