పవన్ కి హీరోయిన్ బిస్కెట్

Update: 2017-09-15 05:55 GMT
పవన్ కళ్యాణ్ అసలు ఎవరికీ అందడు. ముఖ్యంగా హీరోయిన్స్ విషయంలో అయితే.. శృతి హాసన్-రేణూ దేశాయ్ లను మినహాయిస్తే.. మరో హీరోయిన్ ని రిపీట్ చేసిన దాఖలాలు లేవు. అంటే పవన్ తో నటించే ఛాన్స్ అంటే లైఫ్ టైం ఆఫర్ అన్నమాటే.

పైగా ప్రస్తుత పరిస్థితుల్లో పవన్ ఇంకా ఎన్ని సినిమాలు చేస్తాడో తెలియదు కాబట్టి.. చేసినంతలోనే పవన్ తో ఓ మూవీ దక్కించుకోవాలని పలువురు హీరోయిన్స్ భావిస్తుంటారు. ఇప్పుడు అర్జున్ రెడ్డి హీరోయిన్ దాదాపుగా ఇలాంటి పనే చేసింది. సోషల్ మీడియాలో పవర్ స్టార్ అప్పుడప్పుడు యాక్టివ్ గా ఉంటాడు. పైగా ఎప్పుడో మినహాయిస్తే పర్సనల్ ట్వీట్స్ ను చేసే అలవాటు లేదు. ఎక్కువగా రాజకీయ ప్రయోజనాల కోసమే ట్విట్టర్ ను ఉపయోగిస్తుంటాడు పవన్. అందుకే.. పవన్ ట్వీట్స్ ను పట్టించుకుంటారు కానీ.. ట్విట్టర్ హ్యాండిల్ కి సంబంధించిన అప్ డేట్స్ అంతగా పట్టించుకోరు జనాలు.

అయితే.. ఇప్పుడు పవన్ కు 2 మిలియన్ల మంది ఫాలోయర్స్ వచ్చారు. సహజంగా అయితే. దీనిపైనే ట్వీట్ చేసింది అర్జున్ రెడ్డి హీరోయిన్ షాలినీ పాండే. 2 మిలియన్ల మంది ఫాలోయర్స్ మార్క్ ను అందుకున్నందుకు కంగ్రాచ్యులేషన్స్ చెప్పింది. ఈమె ఒక్కతే ఇలా విషెస్ చేసింది. పవన్ కళ్యాణ్ దృష్టిలో పడ్డానికి ఈమె ఎంచుకున్న రూట్ భలే గుంది కదూ.
Tags:    

Similar News