పవన్ కి థ్యాంక్స్ అంటున్న శంకర్

Update: 2016-02-10 11:30 GMT
జబర్దస్త్ కామెడీ షో ద్వారా పేరు సంపాదించిన షకలక శంకర్.. ఇఫ్పుడు టాలీవుడ్ లో మంచి కమెడియన్ గా ఎదుగుతున్నాడు. అయితే.. ఈ ఆర్టిస్టు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి వీరాభిమాని. పవన్ కోసం ప్రత్యేకంగా బోలెడు స్కిట్స్ చేశాడు. పవర్ స్టార్ ను దేవుడు చేసేసి మరీ స్కిట్స్ చేసి, మెగా ఫ్యాన్స్ ని ఆకర్షించాడు.

ఇప్పుడు షకలక శంకర్ కి పవన్ స్వయంగా లిఫ్ట్ ఇస్తుందడం విశేషం. సినిమాల్లో చిన్నా చితకా రోల్స్ నుంచి.. సినిమా అంతా కనిపించే కామెడీ యాక్టర్ అవకాశాలు ఇప్పుడే వస్తున్నాయి. ఇలాంటి సమయంలోనే తన మూవీలోనూ ఆఫర్ ఇచ్చాడు పవర్ స్టార్. తన రాబోయే మూవీ సర్దార్ గబ్బర్ సింగ్ లో ఒక పాత్రను షకలక శంకర్ ను తీసుకున్నాడు పవన్. అంతేకాదు ఈ షకలక శంకర్ సోదరుడు వరహాల బాబుకు కూడా ఇంకో రోల్ ఇచ్చారట. దీంతో సర్దార్ - పవన్ కళ్యాణ్ లకు థాంక్స్ చెబుతూ ట్వీట్ చేశాడీ కమెడియన్. ఇదిలా ఉంటే.. కేవలం షకలక శంకర్ కే కాదు.. జబర్దస్త్ టీంలో చాలామందికి సర్దార్ లో ఛాన్స్ ఇచ్చారట.

జబర్దస్త్ కార్యక్రమానికి జడ్జ్ గా వ్యవహరిస్తున్న నాగబాబు సూచించిన మేరకు.. ఆఫర్స్ దక్కాయని చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం హైద్రాబాద్ లో సర్దార్ గబ్బర్ సింగ్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఓ భారీ విలేజ్ సెట్ లో చేస్తున్న షూటింగ్ తో.. చిత్రీకరణ పూర్తి కానుంది. ఏప్రిల్ 8న సర్దార్ గబ్బర్ సింగ్ విడుదల అవుతుందని.. ఇప్పటికే ప్రకటించింది యూనిట్.
Tags:    

Similar News