గన్ను, గుర్రం, లుంగీ.. పక్కనే పవర్

Update: 2016-01-14 15:59 GMT
పవర్ స్టార్ అలా నడిచొస్తే చాలు.. ఫ్యాన్స్ కి పూనకాలు వచ్చేస్తాయి. ఆ విషయం మేకర్స్ కి కూడా బాగానే తెలుసు. అప్పుడెప్పుడో పవన్ కళ్యాణ్ పుట్టిన రోజున సర్దార్ గబ్బర్ సింగ్ కి ఓ టీజర్ ఇచ్చారు. అందులో గుర్రాన్ని పట్టుకుని పవన్ అలా నడిచొస్తూ ఉంటాడంతే.

రత్నాపూర్ కా సర్దార్ ఆగయా అంటూ.. టీజర్ రిలీజ్ చేయబోతున్నట్లు ముందే చెప్పారు సర్దార్ నిర్మాతలు. అన్నట్లుగానే పండుగ రోజున ఓ టీజర్ ను లాంఛ్ చేశారు. అభిమానులకు సంక్రాంతి శుభాకాంక్షలు చెబతూ.. సర్దార్ గబ్బర్ సింగ్ కి స్పెషల్ టీజర్ రిలీజ్ అయింది. ఇందులో కూడా సేమ్.. మొదటి టీజర్ లాగానే భుజాన గన్ వేసుకుని, ఎడం చేత్తో గుర్రాన్ని పట్టుకుని.. పవన్ నడుచుకుంటూ వస్తున్నాడు. ఈ మూవీ కోసం వేసిన భారీ రత్నాపూర్ సెట్ లో ఓ రోడ్డుపై పవన్ పై ఇలా వాకింగ్ చేస్తున్నాడన్న మాట.

మొత్తం గెటప్ లోకి పవన్ కట్టిన లుంగీనే స్పెషల్ గా చెప్పుకోవాలి. ఖాకీ చొక్కా వేసి, షర్ట్ పైకి గబ్బర్ సింగ్ బెల్ట్ పెట్టి, లుంగీ కట్టుకుని పవర్ స్టార్ నడుచుకుంటూ వస్తుంటే.. పవర్ అంటే ఇలా ఉంటుందని చెబుతున్నట్లుగా ఉంది. సాధారణంగా గెటప్ విషయంలో క్లాసీగా ట్రై చేసే పవన్.. ఇలా ఫుల్ మాస్ గెటప్ లో కనిపించడం ఫ్యాన్స్ ని కేకలు పెట్టించేస్తోంది. యూట్యూబ్ లో రిలీజ్ అయిన కాసేపట్లోనే.. విపరీతమైన వ్యూస్ వస్తున్నాయి సర్దార్ టీజర్ కి.

Full View
Tags:    

Similar News