అదే అడుగుతున్న పవన్ ప్రొడ్యూసర్

Update: 2015-11-27 11:30 GMT
పవన్ కళ్యాణ్ - మహేష్ బాబు.. ఈ ఇద్దరు ఎవరు బిగ్ స్టార్ అంటే సమాధానం చెప్పడం చాలా కష్టం. ఫాలోయింగ్ విషయంలో ఎవరూ ఎవరికీ తీసిపోరు. ఇండస్ట్రీ రికార్డుల విషయంలోనూ అంతే. మహేష్ పోకిరి - శ్రీమంతుడు లాంటి సినిమాలతో రికార్డుల మోత మోగిస్తే.. పవన్ అత్తారింటికి దారేది - గబ్బర్ సింగ్ లాంటి సినిమాలతో తన సత్తా చూపించాడు.

ఐతే ఓవరాల్ గా చూస్తే ఎవరికి వాళ్లే సాటి కానీ.. యుఎస్ బాక్సాఫీస్ విషయానికి వస్తే మాత్రం మహేష్ ను కొట్టే మొనగాడు లేడు. అక్కడ ఫస్ట్ మిలియన్ డాలర్ క్లబ్బులోకి అడుగుపెట్టడమే కాదు.. సినిమా సినిమాకూ తన రేంజి పెంచుకుంటూ పోతున్నాడు మహేష్. ‘బాహుబలి’ని మినహాయిస్తే యుఎస్ లో మహేష్ సినిమాల రికార్డులు మరెవరికీ సాధ్యం కానివి. ఐతే పవన్ కు కూడా అక్కడ మంచి ఫాలోయింగే ఉంది కానీ.. మహేష్ స్థాయిలో ట్రాక్ రికార్డు లేదు. ఐతే ‘సర్దార్ గబ్బర్ సింగ్’కు మాత్రం మహేష్ సినిమాలతో సమానంగా రేటు అడుగుతున్నాడట నిర్మాత శరత్ మరార్.

మహేష్ కొత్త సినిమా ‘బ్రహ్మోత్సవం’కు ఇప్పటికే యుఎస్ బిజినెస్ క్లోజ్ అయిపోయింది. శ్రీమంతుడు కంటే కూడా దీనికి మంచి రేటే పలికిందట. ఐతే ఇదే రేటును ‘సర్దార్’కు కూడా అడుగుతున్నాడు మరార్. ఐతే బయ్యర్లు మాత్రం ఆ రేటు ఇవ్వడానికి ఒప్పుకోవట్లేదట. మహేష్-శ్రీకాంత అడ్డాల కాంబినేషన్ కు ఉన్న క్రేజ్ వేరని.. పవన్-బాబి కాంబినేషన్ని నమ్మి అంత పెట్టుబడి పెట్టలేమని అంటున్నారట. దీంతో నిర్మాత యుఎస్ రైట్స్ ను ఎవరికీ అమ్మకుండా హోల్డ్ లో పెట్టినట్లు సమాచారం. రిలీజ్ కు ముందు సినిమాకు క్రేజ్ వచ్చాక వ్యవహారం తేలుద్దామన్నది ఆయన ప్లాన్.
Tags:    

Similar News