ఫోటో స్టొరీ: అక్కా చెల్లెళ్ళ బికినీ రచ్చ

Update: 2018-12-18 07:37 GMT
బ్యూటీ కృతి సనన్ సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగే ఉంది.  ఇన్స్టాగ్రామ్ లో 15 మిలియన్ ఫాలోయర్లు ఉన్నారంటేనే ఆమె సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు.  తరచుగా అప్డేట్లు ఇస్తూ అభిమానులను అలరిస్తూ ఉంటుంది.

తాజా గా కృతి సనన్ తన ఫ్యామిలీ తో పాటు గా మాల్దీవ్స్ వెకేషన్ కు వెళ్ళింది. కృతి కి ఒక నూపూర్ సనన్ అనే ముద్దుల చెల్లి ఉంది. వెకేషన్ కావడంతో సనన్ సిస్టర్స్ ఇద్దరూ కలిసి ఫుల్ గా హంగామా చేస్తున్నారు. అక్కడ తాజ్ హోటల్ స్విమింగ్ పూల్ లో దిగి బికినీ గెటప్పుల్లో ఫోటోలు తీసుకొని ఆ ఫోటోలను ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. అక్క బ్లాక్ బికిని లో ఉంటే.. చెల్లి పింక్ బికిని లో దర్శనమిచ్చింది. ఈ ఫోటోల కు ఆమె ఇచ్చిన క్యాప్షన్ "ఆయన ఎవరైనా కావొచ్చు.. ముందు మాత్రం ఈమె. నువ్వుంటే నేను సంతోషం గా ఉంటా.. నా మసనుకు ఈ విషయం తెలుసు."

దీనర్థం కాబోయే భర్త కంటే ముందు చెల్లి నూపూర్ ముఖ్యం అంటోంది.  మంచిదే.. చెల్లి అంటే ఏ అక్కకు ఇష్టం ఉండదు. అయినా కృతి సనన్ బాయ్ బాయ్ ఫ్రెండ్ సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అని బాలీవుడ్ లో ఎప్పటినుంచో ప్రచారం సాగుతోంది. మరి అయన ఏమంటాడో..? ఈ విషయం పక్కన బెడితే.. చెల్లి బికినీ ఫోటోలు పోస్ట్ చేస్తూ ఉందంటే త్వరలో తనను బాలీవుడ్ కు హీరోయిన్ గా పరిచయం చేస్తుందేమో!
Tags:    

Similar News