మా ఆయన ఆట చూడ్డానికే వచ్చా

Update: 2017-02-27 15:29 GMT
మన దేశంలో జరిగే ఐపిఎల్ ను కాపీ కొట్టేసి ఇప్పుడు పాకిస్తాన్ వారు కూడా పాకిస్తాన్ సూపర్ లీగ్ అంటూ ఒక టోర్నమెంట్ పెట్టేశారులే. ఈ టోర్నీని పాక్ లో జరిపితే చాలామంది ఇంటర్నేషనల్ క్రికెటర్లు రానని మొండికేయడంతో ఇప్పుడు దీనిని దుబాయ్ లో నిర్వహిస్తున్నారు. అక్కడకు చాలామంది క్రికెటర్లతో పాటు వారి ప్రియురాళ్ళూ భార్యలూ కూడా విచ్చేస్తున్నారు.

అదే కోవలో ఇప్పుడు ఇండియన్ టెన్నిస్ సెన్సేషన్ సానియా మీర్జా కూడా విచ్చేసింది. తన భర్త.. పాకిస్తాన్ క్రికెటర్ షోయెబ్ మాలిక్ ఈ టోర్నమెంటులో ఆడుతున్నాడు. ఈ సందర్బంగా అమ్మడు దుబాయ్ లో తన ట్రేడ్ మార్కు ముక్కుపుడక లుక్కులో తెగ హల్చల్ చేస్తోంది. ఏంటి సానియా ఇటొచ్చావ్ అంటే.. ''ఇక్కడ మా ఆయన షోయెబ్ మాలిక్ ఆడుతున్నాడు. తను నా టెన్నిస్ మ్యాచులు చూడ్డానికి వస్తుంటాడు. అందుకే నేను కూడా తన మ్యాచ్ లను తిలకించడానికి ఇటొచ్చాను'' అంటూ చురుకుగా సెలవిచ్చింది ఈ సుందరి.

మొత్తానికి ఎప్పటికప్పుడు సానియా అండ్ షోయెబ్ మధ్యలో ఏదో తేడా వచ్చిందని గ్యాసిప్పులు రావడం.. అవన్నీ నిజం కాదన్నట్లు అమ్మడు ఇలా భర్త కోసం పాక్ అండ్ దుబాయ్ వెళ్ళడం.. సర్వ సాధారణమైపోయిందిలే. ఇకపోతే దుబాయ్ లో వీరిద్దరికీ ఒక అపార్ట్ మెంట్ కూడా ఉందిలే. అక్కడే వీరి కాపురం సాగిస్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News