నాగరత్నమ్మ ఈమె కాదు ఆమె!!

Update: 2020-03-28 15:00 GMT
గత కొన్ని రోజులుగా బెంగళూరు నాగరత్నమ్మ అనే ఉద్యమ నాయకురాలి బయోపిక్‌ కోసం ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు ప్రయత్నాలు చేస్తున్నారంటూ వార్తలు వస్తున్న విషయం తెల్సిందే. ఇప్పటికే ఆయన స్క్రిప్ట్‌ పనిలో ఉన్నాడనే ప్రచారం కూడా జరుగుతోంది. ఈ వార్తలు ప్రారంభం అయిన సమయంలో అనుష్క ను మొదట నాగరత్నమ్మ పాత్ర కోసం సంప్రదించినట్లుగా వార్తలు వచ్చాయి. కాని ఇప్పటి వరకు సింగీతం ఎవరిని కూడా ఆ పాత్ర కోసం సంప్రదించలేదట.

స్క్రిప్ట్‌ వర్క్‌ పూర్తి అయిన తర్వాత ఆ పాత్ర కోసం నటీమనులను సంప్రదించడం మొదలు పెట్టాలని ఆయన భావిస్తున్నాడట. ప్రస్తుతానికి కరోనా కారణంగా స్క్రిప్ట్‌ వర్క్‌ కూడా మెల్లగా సాగుతున్నట్లుగా సమాచారం అందుతోంది. ఇక ఇదే సమయంలో సింగీతం మనసులో నాగరత్నమ్మ పాత్ర కోసం సమంత అయితే బాగుంటుందని ఉందట. ఆమె బాడీ లాంగ్వేజ్‌ మరియు ఇతరత్ర విషయాలు నాగరత్నమ్మ పాత్రకు సరిగ్గా సెట్‌ అవుతాయని అనుకుంటున్నారట.

ఇప్పటి వరకు సమంతతో కూడా ఈ విషయాన్ని ఆయన చర్చించలేదని తెలుస్తోంది. ఈమద్య కాలంలో సమంత వరుసగా లేడీ ఓరియంటెడ్‌ చిత్రాలను చేస్తున్న విషయం తెల్సిందే. ఈ పాత్రకు ఖచ్చితంగా ఆమె సూట్‌ అవుతుందనే నమ్మకంగా ఆయన ఉన్నాడట. ఇలాంటి పాత్రను ఛాలెంజింగ్‌ గా తీసుకుని సమంత చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఈ కరోనా హడావుడి తగ్గిన తర్వాత నాగరత్నమ్మ సినిమా పనులు వేగవంతం అయ్యే అవకాశం ఉందని అంటున్నారు.
Tags:    

Similar News