వాటే హాట్.. సమంత తగ్గట్లేదసలు

Update: 2017-02-22 10:41 GMT
మొన్ననే ఎంగేజ్మెంట్ అయ్యింది కాబట్టి.. త్వరలోనే పెళ్ళవుతుంది కాబట్టి.. మునుపటిలా సినిమాల్లో చాలా హాటుగా కనిపిస్తుంది అంటారా? అంటూ చాలామంది నోరు వెళ్ళబెట్టారు. ఒకవేళ సమంత పైన ఇలాంటి సందేహాలు ఏమైనా వస్తే మాత్రం వెంటనే వాటిని తీర్చేసుకోండి. ఎందుకంటే తన తదుపరి సినిమాలో అమ్మడు ఎలా కనిపించబోతోందో ఇప్పుడు చిన్న హింట్ కూడా ఇచ్చేసింది.

తమిళంలో త్యాగరాజ కుమారరాజు అనే దర్శకుడి డైరక్షన్లో అమ్మడు ఇప్పుడు ఒక రొమాంటిక్ కామెడీ చేస్తోంది. ఈ సినిమాలో విజయ్ సేతుపతి అలాగే గౌతమ్ కార్తీక్ హీరోలుగా నటిస్తున్నారు. షూటింగ్ స్పాట్ నుండి ఒక ఫోటో షేర్ చేసి.. నటిగా బ్రతకడం అంటే ఒకటే జీవితాన్ని రకరకాలుగా జీవించవచ్చు అంటూ కామెంట్ చేసింది స్యామ్. అదంతా ఒకెత్తయితే.. అమ్మడి స్లీవ్ లెస్ టాప్ అండ్ హాట్ లుక్ మరో ఎత్తు. ఆ బ్లాక్ వైట్ ఫోటోలో కూడా అమ్మడు ఇంత హాటుగా ఉందంటే.. ఇక కలర్ ఫుల్ లుక్స్ లో పిచ్చెత్తించడం ఖాయం కదూ.

మొత్తానికి హాలీవుడ్ నటీమణుల తరహాలో పెళ్ళయినా కూడా గ్లామర్ అండ్ హాట్నెస్ విషయంలో సమంత ఏమాత్రం తగ్గదేమో. తప్పకుండా అమ్మడిని న్యూ ఏజ్ న్యూ జనరేషన్ నటీమణి అనాల్సిందే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News