ఒకే వేదిక‌పై చిరు - స‌ల్మాన్ ఫ్యాన్స్ కి పండ‌గే!

Update: 2022-09-26 16:30 GMT
మెగాస్టార్ చిరంజీవి  క‌థానాయ‌కుడిగా మోహ‌న్ రాజా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న చిత్రం   చిత్రం 'గాడ్ ఫాదర్' ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి.  అన్ని ప‌నులు పూర్తిచేసి అక్టోబర్ 5న గ్రాండ్ రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.  ఈ సంద‌ర్భంగా యూనిట్ ప్ర‌చారం ప‌నుల్ని స్పీడ‌ప్ చేస్తుంది.

తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను సెప్టెంబర్ 28న అనంతపూర్‌లో నిర్వహించనున్నట్లు తెలిసింది.  ఈ వేడుకకు బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ప్రత్యేక అతిథిగా హాజరుకానున్నారు.  

ఫిల్మ్ నగర్‌లోని కథనాల ప్రకారం ఈ వేడుకకు సల్మాన్ ఖాన్‌ను చిరంజీవి వ్యక్తిగతంగా  ఆహ్వానించిన‌ట్లు స‌మాచారం. అందుకు సల్మాన్ అంగీకరించినట్లు తెలుస్తోంది.

ఈ సినిమాలో ఓ ప్రత్యేక పాటలో క‌నిపించ‌డంతో పాటు  చిన్న పాత్ర‌లో స‌ల్మాన్  న‌టించిన సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే టీజ‌ర్ లో భాయ్-చిరు ఎలా క‌నిపించ‌నున్నారు అన్న‌ది రివీల్ చేసారు. ఈనేప‌థ్యంలో ఇద్ద‌రు ఒకే వేదిక‌పై క‌నిపించ‌డం అభిమానుల్లో ఆస‌క్తిని మ‌రింత పెంచుతుంది. ఆ ఇద్ద‌ర్నీ ఒకవేదిక‌పై ఎప్పుడు చూస్తామా? అన్న ఉత్సాహంతో ఎదురుచూస్తున్నారు.

వాస్త‌వానికి ఈ వేడుకకు స‌ల్మాన్ వ‌స్తారా?  రారా? అన్న మీ మాంస ఉండేది.  స‌ల్మాన్ పాత్ర విష‌యంలో అసంతృప్తిగా ఉన్నార‌ని...ఆ కార‌ణంగా భాయ్ ఈవెంట్ కి  వ‌చ్చే ఛాన్స్ లేద‌ని నెట్టింట ప్ర‌చారం సాగింది. కానీ చిరు స్వ‌యంగా ఆహ్వానించ‌డంతో భాయ్ రంగంలోకి దిగ‌క త‌ప్ప‌లేద‌ని తెలుస్తోంది.

ఇద్ద‌రు చాలా కాలంగా మంచి స్నేహితులు. స‌ల్మాన్  ఎప్పుడు హైద‌రాబాద్ వ‌చ్చినా చిరంజీవి ఇంటికి త‌ప్ప‌క  వ‌చ్చేస్తారు. ఆయ‌న ఇంటి అతిధ్యం త‌ప్ప‌నిస‌రిగా తీసుకోవాల్సిందే. ఆ బాండింగ్ కార‌ణంగానే చిరంజీవి అడ‌గ‌గానే గాడ్ ఫాద‌ర్ లో న‌టించ‌డానికి స‌ల్మాన్ అంగీక‌రించారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News