ఎండల్లో తేజు ఏం కష్టపడుతున్నాడో

Update: 2017-04-23 05:19 GMT
వరుస సక్సెస్ లతో దూకుడు చూపించిన సాయిధరం తేజ్.. తిక్క.. విన్నర్ అంటూ రెండు ఎదురుదెబ్బలు తినేశాడు. దీంతో తన నెక్ట్స్ మూవీ విషయంలో మాత్రం చాలా ఎఫర్ట్ చూపిస్తున్నాడు సుప్రీం హీరో. ప్రస్తుతం ఈ యంగ్ మెగా హీరో జవాన్ అనే మూవీలో నటిస్తున్నాడు.

బీవీఎస్ రవి దర్శకత్వంలో రూపొందుతున్న జవాన్ చిత్రంలో.. తేజు టైటిల్ రోల్ పోషిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైద్రాబాద్ లో జరుగుతుండగా.. సమ్మర్ ఎండలకు ఏ మాత్రం వెనకాడకుండా పిక్చరైజ్ చేస్తున్నారు. ప్రస్తుతం తేజు నటించిన సీన్స్ ను తెరకెక్కిస్తుండగా.. వీటిని కంప్లీట్ చేసేందుకు సుదీర్ఘంగా ఎండలోనే కష్టపడాల్సి వస్తోంది. ఇంతటి టెంపరేచర్ ను కూడా ఏ మాత్రం వెనకాడకుండా సాయిధరం తేజ్ కష్టపడ్డం.. గంటల కొద్దీ అలసిపోకుండా షూటింగ్ చేయడం చూసి.. యూనిట్ వర్గాలు ఆశ్చర్యపోతున్నారు.

హైద్రాబాద్ లోని ఓల్డ్ సిటీలో జరుగుతున్న ఈ షూటింగ్ మరికొన్ని రోజుల పాటు కొనసాగనుందని  తెలుస్తోంది. జవాన్ అనే టైటిల్ పెట్టినా.. ఇది ఓ ఫ్యామిలీ డ్రామాగా అని చెబుతున్నారు యూనిట్. తమిళ నటుడు ప్రసన్న ఈ చిత్రంలో కీలక పాత్ర  పోషిస్తున్నాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News