#RRR: చరణ్ తారక్ లు ఆ ట్రైనింగ్ లో

Update: 2018-11-18 07:19 GMT
సినీప్రియులందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రాజమౌళి తాజా చిత్రం ఈమధ్యనే ప్రారంభోత్సవం జరుపుకుంది.  రెగ్యులర్ షూటింగ్ రేపటినుండి మొదలుపెడుతున్నారు.  ఈ షెడ్యూల్ రెండు వారాల పాటు సాగుతుందని.. ఇందులో ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ ను చిత్రీకరించేందుకు జక్కన్న టీమ్ సన్నాహాలు చేసిందట.

ఇదిలా ఉంటే ఎన్టీఆర్.. చరణ్ లు ప్రస్తుతం రిహార్సల్స్ చేస్తున్నారని ఇప్పటికే వార్తలు వచ్చాయి.  తాజా సమాచారం మేరకు ఇద్దరూ మన దేశంలో ప్రాచీన పోరాట విద్య అయిన కత్తిసాములో ట్రైనింగ్ తీసుకుంటున్నారట. ప్రతిరోజూ ఉదయం పూట ఈ ట్రైనింగ్ కోసం ఇద్దరూ చెమటోడుస్తున్నారట.   ఈ సినిమాలో ఇద్దరూ గతంలో లేని విధంగా భారీ మేకోవర్ తో కనిపిస్తారట.  మరోవైపు ఫస్ట్ షెడ్యూల్ కోసం అల్యూమినియం ఫ్యాక్టరీ లో ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ సాబు సిరిల్ ఆధ్వర్యంలో ఒక భారీ బ్రిడ్జి సెట్ ను నిర్మించారట.  ఈ బ్రిడ్జ్ దగ్గరే యాక్షన్ ఎపిసోడ్ చిత్రీకరణ జరుగుతుందట.

ఇక ఈ సినిమాలో హీరోయిన్లను ఇతర ఆర్టిస్టులను ఎంపికచేసేందుకు బాలీవుడ్ క్యాస్టింగ్ డైరెక్టర్ జోగి మలంగ్ సహకారం తీసుకోనున్నారన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ ఫిబ్రవరిలో ప్రారంభం అవుతుంది.  అంతలోపు హీరోయిన్లు.. ఇతర ఆర్టిస్టుల ఎంపిక పూర్తవుతుందని సమాచారం.
    

Tags:    

Similar News