గ్లామరసం ఒలకబోసిన 'గురు' బ్యూటి

Update: 2017-03-08 18:08 GMT
రితికా సింగ్ ఓ స్పోర్ట్స్ పర్సనాలిటీ. కిక్ బాక్సర్ అండ్ మిక్సెడ్ మార్షల్ ఆర్ట్స్ ప్లేయర్ అయిన ఈమె.. ఫిలిం ఇండస్ట్రీలో కూడా సత్తా చాటేస్తోంది. తమిళ్ లో ఇరుధి సూత్రు.. హిందీలో సాలా ఖడూస్ అంటూ రెండు భాషల్లో ఒకే మూవీతో అడుగుపెట్టింది. అదే సినిమాని ఇప్పుడు గురు అంటే వెంకీ హీరోగా రీమేక్ చేస్తుండగా.. తెలుగులో కూడా ఆ పాత్రను తానే పోషిస్తూ.. ఒకే సినిమాతో మూడు భాషల్లో అరంగేట్రం చేస్తోంది రితికా.

తమిళ్ లో ఇప్పటికే వరుస సినిమాలు చేస్తోందీ ప్లేయర్ కం ఆర్టిస్ట్. విజయ్ సేతుపతితో ఆందావన్ కట్టాలై అనే మూవీ చేసి హిట్ కూడా సాధించేసిన రితికా సింగ్.. ఇప్పుడు గ్లామర్ ఫీల్డ్ కి తగ్గట్లుగా మారిపోతోంది. రీసెంట్ గా ఈమె ఉమెన్ ఎక్స్ క్లూజివ్ మేగజైన్ చేసిన ఫోటో షూట్ చూస్తే.. షాక్ తినేయాల్సిందే. చిట్టి పొట్టి బట్టలు వేసుకుని అందాల కొలతలను ఫోటోల్లో పట్టించేసింది. ఇంకా క్లీవేజ్ షో వరకూ రాలేదు కానీ.. ఈ భామ స్పీడ్ చూస్తే అదేమంత దూరంలో లేదని అనిపించేయక మానదు. ముఖ్యంగా కవర్ పేజ్ కోసం రెడ్ కలర్ డ్రస్ లో ఇచ్చిన పోజ్ లో అయితే.. గ్లామర్ డాళ్ అనిపించేసుకుంది.

ప్రస్తుతం ఈమె చేతులో గురు మూవీ కాక.. రెండు తమిళ చిత్రాలున్నాయి. లారెన్స్ హీరోగా పి.వాసు దర్శకత్వంలో రూపొందిన శివలింగ.. వచ్చే నెల 7న రిలీజ్ కానుండగా.. అరవింద్ స్వామితో కలిసి వనంగముడి అనే మూవీలో నటించేస్తోంది రితికా సింగ్.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News