రిలీజ్ కాకుండానే రేణుక వచ్చేసింది

Update: 2018-04-25 07:44 GMT
సినిమా రిలీజ్ కు కొద్ది రోజుల ముందు నుంచి ఆడియో రిలీజ్ చేయడం.. ప్రోమోలతో పాటలు రిలీజ్ చేయడం ఎప్పటి నుంచో ఉన్నదే. ఈమధ్య టాలీవుడ్ లో పాటల రిలీజ్ విషయంలో కొత్త ట్రెండ్ మొదలైనట్టు కనిపిస్తోంది. సినిమా రిలీజ్ కన్నా పాట అఫీషియల్ గా రిలీజ్ చేసేస్తున్నారు.

మంచు విష్ణు హీరోగా నటించిన ఆచారి అమెరికా యాత్ర వచ్చే నెలలో రిలీజ్ కానుంది. ఈ మూవీ షూటింగ్ చాలారోజుల క్రితమే పూర్తయినా రిలీజ్ కు టైం కలిసిరాలేదు. ఎట్టకేలకు రిలీజ్ టైం దగ్గర పడటంతో మూవీపై బజ్ పెంచేందుకు అందులోని రేణుక అనే ఫోక్ సాంగ్ ను యూట్యూబ్ లో పెట్టేశారు. హీరో విష్ణు.. కంచె ఫేం హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ హుషారుగా స్టెప్పులేస్తూ సాగిపోయిన ఈ పాట ఫుల్ వీడియో ప్రేక్షకుల ముందుకు తెచ్చేశారు. ఫోక్ సాంగ్ కాబట్టి జనాలకు తొందరగా కనెక్టయ్యే అవకాశముంది.

ఇంతకుముందు నాగశౌర్య హీరోగా నటించిన ఛలో సినిమా కోసం ఇలా వీడియో సాంగ్ ముందే రిలీజ్ చేశారు. ఈ పాట ఆకట్టుకోవడంతోపాటు సినిమాపై బజ్ పెంచింది. ఇప్పుడు ఆచారి అమెరికా యాత్ర టీం కూడా దాదాపుగా ఇదే సూత్రం ఫాలో అయిపోయింది. కాకుంటే ఛలోలో సగం పాట మాత్రమే రిలీజ్ చేస్తే ఆచారి అమెరికా యాత్రలో మొత్తం పాట రిలీజ్ చేశారు. 

వీడియో చూడటానికి క్లిక్ చేయండి


Full View
Tags:    

Similar News