మాస్ మహ'రాజా.. ది గ్రేట్' అంటున్నారు

Update: 2017-01-20 12:36 GMT
టాలీవుడ్ కి మాస్ మహరాజ్ రవితేజ. తన కటౌట్ తో మాస్ జనాలను ఆకట్టుకోగలగడం రవితేజ స్పెషాలిటీ. సాధారణంగా ఏడాదికి రెండు మూడు సినిమాలు రిలీజ్ చేసేస్తూ.. తన హై ఎనర్జీ లెవెల్స్ చూపిస్తుంటాడు. కానీ కొన్ని నెలలుగా.. ఇంకా క్లియర్ గా చెప్పుకుంటే 14 నెలలుగా ఒక్క సినిమాని కూడా సెట్స్ పైకి తీసుకెళ్లలేదు రవితేజ.

2015 చివర్లో వచ్చిన బెంగాల్ టైగర్ మాస్ మహరాజ్ కి చివరి మూవీ. అక్కడి నుంచి పలు ప్రాజెక్టులు అనుకోవడం.. క్యాన్సిల్ అయిపోవడం తప్ప సెట్స్ పైకి ఏ మూవీ వెళ్లలేదు. ఈ గ్యాప్ ను ఫ్యామిలీతో గడిపేందుకు ఉపయోగించుకున్న రవితేజ.. ఫ్రెండ్స్ తో కూడా బాగానే ఎంజాయ్ చేశాడు. రీసెంట్ గా అనిల్ రావిపూడితో ఓ ప్రాజెక్టును ఫైనల్ చేసుకున్న ఈ హీరో.. త్వరలో ఈ మూవీని సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు రెడీ అవుతున్నాడు. మాస్ మహరాజ్ బాగా గ్యాప్ తీసుకుని చేస్తున్న ఈ మూవీకి 'రాజా ది గ్రేట్' అనే టైటిల్ ని ఫైనల్ చేసినట్లుగా తెలుస్తోంది.

రాజా ది గ్రేట్ టైటిల్.. ఈ మూవీకి పర్ఫెక్ట్ అంటున్నాడట దర్శకుడు అనిల్ రావిపూడి.  నిర్మాత దిల్ రాజు కూడా ఇదే టైటిల్ కి మొగ్గుతున్నట్లు టాక్. గతంలో కొన్ని విషయాల్లో రవితేజ-దిల్ రాజుల మధ్య తేడాలు వచ్చినా.. మళ్లీ అనిల్ రావిపూడి వాటన్నిటినీ సెట్ చేసి.. ఈ కాంబోలో రాజా ది గ్రేట్ ను మొదలుపెట్టేయనున్నాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News