వాటే ఐడియా!! తెలుగు ఫిలిం ఇండస్ర్టీ డే

Update: 2016-04-30 06:02 GMT
ఇప్పుడు ప్రపంచంలో ప్రతీ సందర్భానికీ, ప్రతీ రిలేషన్ కి ఓ రోజు ఉంది. లవర్స్ డే - మదర్స్ డే - టీచర్స్ డే లాంటి వాటితో పాటు డయాబెటిస్ డే - క్యాన్సర్ డే - ఎయిడ్స్ డే.. ఇలాంటివి చాలానే ఉన్నాయి. అలాగే రెండు తెలుగు రాష్ట్రాలు విడిపోయాక.. ఎవరి రాష్ట్ర ఏర్పాటు దినోత్సవాన్ని వాళ్లు జరుపుకుంటున్నారు. తెలుగు సినీ పరిశ్రమకు కూడా ఇలాంటి ఒక రోజు ఉంటే బాగుండేదన్న ఐడియా ఆ బ్రదర్స్ కి వచ్చింది.

వాళ్లెవరో కాదు.. ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ లు. తెలుగు సినీ ఇండస్ట్రీకి కూడా ఇలాంటి ఒక ప్రత్యేకమైన రోజు ఉండాలని అంటున్నారు వీరిద్దరూ. ఆ రోజున మొత్తం 24 క్రాఫ్ట్స్ కి సెలవు ఉండాలని, పరిశ్రమ అంతా వేడుకలు చేసుకోవాలని ప్రతిపాదిస్తున్నారు. ఇప్పటికే తమ ఆలోచనను చాలామంది సినీ ఇండస్ట్రీ పెద్దలకు చెప్పగా.. వారి నుంచి మద్దతు కూడా లభించింది. త్వరలో వీరిద్దరూ కలిసి ప్రొడ్యూసర్ కౌన్సిల్ ను కూడా అప్రోచ్ కానున్నారు.

నిర్మాతల మండలి కూడా ఒప్పుకుంటే.. తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి కొత్త పండుగ రోజు వచ్చేసినట్లే. అయితే ఇది లాంఛనమే అని చెప్పాల్సిందే. త్వరలో అధికారికంగా ఈ విషయాన్ని వెల్లడించేందుకు రామ్ లక్ష్మణ్ లు ఓ ప్రెస్ మీట్ కూడా ఏర్పాటు చేయనున్నారని తెలుస్తోంది. ఆరోజున మిగతా వివరాలు వెల్లడిస్తారట ఈ బ్రదర్స్. ఏమైనా వీరి అలోచనకు ఇండస్ట్రీ మొత్తం మద్దతు పలకడం విశేషం.
Tags:    

Similar News