నయీం పోస్టర్ రిలీజ్ చేసిన వర్మ

Update: 2016-08-31 14:22 GMT
దాదాపు తాను చేసే ప్రతీసినిమా.. సారీ.. తాను ప్రకటించే ప్రతీ సినిమాకు సంబంధించి మనోడు పోస్టర్ రిలీజ్ చేసేస్తుంటాడు. అదే కదా రామ్ గోపాల్ వర్మ ప్రత్యేకత. అందుకే అందరూ రామూతో సినిమా అంటే భయపడతారు. పోస్టర్లు బయటకు వచ్చేస్తాయి కాని.. అసలు సినిమా మాత్రం ఏమైపోతుందో తెలీదు ఒక్కోసారి. ఈ మధ్య కాలంలో అలా మనం ''వంగవీటి'' ''రెడ్డి గారుపోయారు'' ''XXX'' ''బ్రూస్ లీ'' ఇలా చాలా సినిమాల పోస్టర్లను మనోడు రిలీజ్ చేశాడులే. అయితే ఇప్పుడు 'నయీం' సినిమా పోస్టర్ మాత్రం ఆ బాపత్తు కాదండోయ్.

ఇప్పటికే మనోడు గ్యాంగస్టర్, హంతకుడు, అలాగే చాలా రకాల క్రిమినల్ యాక్టివిటీస్ లో ఇన్వాల్వ్ అయిన నయీముద్దీన్ జీవితంపై ఒక సినిమా తీస్తానంటూ ప్రకటించాడు. మొన్ననే పోలీసుల చేతిలో హతమైన ఈ గ్యాంగ్ స్టర్ జీవితం ఏకంగా మూడు పార్టుల సినిమాగా తీయాలని కూడా ప్రకటించాడు.  ఇక రాము దూకుడు చూసి ఆనందపడ్డ ఆయన ఫ్యాన్స్ ఎవరో ఇప్పుడు నయీం పేరుతో అతని క్రిమినల్ కోణాలన్నీ టైటిల్ లో కనిపించేలా ఒక లోగో డిజైన్ చేసి రిలీజ్ చేశారు. దానిని మనోడు చాలా ఇన్నోవేటివ్ గా ఉంది వావ్ అంటూ ట్వీటేశాడు. ఈసారి తను దగ్గరుండి మాత్రం డిజైన్ చేయించలేదులే.

ఇకపోతే సంఘంలో ఎంతోమంది లీడర్లు, గొప్ప వ్యక్తులు, సంఘసంస్కర్తలు ఉన్నప్పుడు.. వారి జీవితాలను వదిలేసి ఇలా ఒక నేరగాడి నేర చరిత్రను సినిమాగా తీయడంవలన అసలు ఒరిగేదేంటి అంటూ ఇప్పటికే క్రిటిక్స్ మనోడి మీద ఫైర్ అవుతున్న సంగతి తెలిసిందే.

Tags:    

Similar News