గాడ్ ఫాథర్ లకు బాబుని తీస్తానంటున్న రామూ

Update: 2015-07-28 16:47 GMT
ఇంగ్లీష్ లో ప్రముఖ అండర్ వరల్డ్ డాన్ కధాంశంతో వచ్చిన 'ది గాడ్ ఫాదర్' నవల అప్పట్లో.. ఆ మాటకొస్తే ఇప్పటికీ సూపర్ హిట్టే.. ఈ నవల నేపధ్యంలో హాలీవుడ్ లో వచ్చిన 'గాడ్ ఫాథర్' మూవీ సిరీస్ లన్నీ అక్కడ ఘన విజయం సాధించాయి. ఇక ఈ గాడ్ ఫాథర్ ని సౌత్ లో పునికి పుచ్చుకున్న రామ్ గోపాల్ వర్మ, మణిరత్నం వంటి అగ్ర దర్శకుల పేర్లు వినిపిస్తాయి.

మణిరత్నం తెరకెక్కించిన నాయకుడు సినిమా ఈ నవలకు స్పూర్తే.. ఇక రామూ విషయానికొస్తే ఇప్పటివరకూ తాను తెరకెక్కించిన అండర్ వరల్డ్ డాన్ సినిమాలన్నీ గాడ్ ఫాదర్ నుండి స్పూర్తిపొందినవే అని పలుమార్లు చెప్పాడు. ప్రస్తుతం 'కిల్లింగ్ వీరప్పన్' తో బిజీగా వున్న ఈ క్రియేటివ్ డైరెక్టర్ తన తదుపరి సినిమాను ప్రకటించాడు.

బెంగుళూరు అండర్ వరల్డ్ డాన్ గా ప్రఖ్యాతి చెందిన ముత్తప్పా రాయ్ ని వర్మ కలుసుకున్నాడట. ఆ మీటింగ్ తో పులకించిపోయిన వర్మ ముత్తప్ప అండర్ వరల్డ్ బాహుబలి అని కీర్తించాడు. ఆయన జీవితకధ నేపధ్యంలో 'అప్పా' అనే సినిమాను తీయనున్నట్లు ప్రకటించాడు. దీనికి 'ది ఫాదర్ ఆఫ్ ఆల్ గాడ్ ఫాదర్స్' అనే ఉపశీర్షిక తగిలించడం విశేషం. ఏదోకటి లెండి.. మనక్కావలసింది వర్మ నుండి హిట్ రావడం అంతే..   
Tags:    

Similar News