మాఫియా కాదు.. కలాం కథ తీయండి

Update: 2015-07-30 04:10 GMT
మాఫియా, అండర్‌ వరల్డ్‌ నేపథ్యంలో సినిమాల్ని తీయాలంటే రామ్‌ గోపాల్‌ వర్మ తర్వాతే. సత్య, సత్య2, సర్కార్‌ ఇవన్నీ ఈ జోనర్‌ లోనే వచ్చి విజయం సాధించాయి. మాఫియా నేపథ్యం అంటే తనకి మక్కువ అని వర్మ తొలి నుంచీ చెబుతూనే ఉన్నాడు. చూస్తే చూడండి. లేకపోతే మానుకోండి అని జనాలకు వార్నింగ్‌ కూడా ఇచ్చాడు. తను ఏం తీయాలనుకుంటే అదే తీసి చూపిస్తున్నాడు.

తనకి ఎంతో ఇష్టమైన సినిమాతో సహజీవనం చేయడం కోసం వర్మ సరదాకి కొన్ని సినిమాలు తీసుకుంటూ బతికేస్తున్నాడు. ప్రేక్షక లోకం వాటిని తప్పని పరిస్థితిలో భరిస్తూనే ఉంది. ఇప్పుడు మాఫియా రూపం మారింది. నిన్నటివరకూ డి -మాఫియా కథల్నే చూపించాను. ఇక నుంచి బి-మాఫియా కథల్ని తెరపై చూపించబోతున్నా అంటూ బిస్కెట్‌ వేస్తున్నాడు. బి- మాఫియా అంటే బెంగళూరు మాఫియా, అండర్‌వరల్డ్‌ అనే అర్థం. అందుకోసం బెంగళూరుకే చెందిన  మాఫియా డాన్‌ ముత్తప్ప రాయ్‌ జీవితకథ ఆధారంగా ఓ సినిమా తీస్తున్నాడు. ఈ సినిమా తీస్తుండగానే మరోవైపు తీవ్రవాది వీరప్పన్‌ జీవితకథ ఆధారంగా ఓ సినిమా తీసేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు. ఇలా ఎప్పటికప్పుడు బర్నింగ్‌ టాపిక్‌లను ఎంపిక చేసుకుని జనాల్లో క్యూరియాసిటీ పెంచి సినిమాలు తీస్తూ పబ్బం గడిపేస్తున్నాడు. సినిమా ఎలా ఉన్నా మొత్తానికి వదిలిపెట్టకుండా తీస్తూనే ఉన్నాడు.

లేటెస్టుగా అబ్ధుల్‌ కలామ్‌ ఇహలోకం వీడి పరలోకం చేరారు. అణుశాస్త్ర పితామహుడి గా ఆయన భారతదేశానికి చేసిన సేవల్ని మర్చిపోలేం. ఇలాంటి మహానుభావుడి జీవిత చరిత్రతో సినిమా తీస్తానని వర్మ ఎందుకు చెప్పడు? ఏదేమైనా అతడికి మాఫియా కథలు నచ్చినట్టు ఇలాంటి ఇన్‌ స్పిరేషన్‌ కలిగించే కథలు కలిగించవు. ఎందుకంటే గొప్పవాళ్ల జీవితాల్లో అతడికి నచ్చేవేమీ ఉండవు. అందుకే తీయడని అనుకోవాలి.
Tags:    

Similar News