ధృవ రేటు గట్టిగానే గిట్టిందే!!

Update: 2016-07-28 07:30 GMT
రామ్ చరణ్ తేజ్ లేటెస్ట్ మూవీ ధృవ షూటింగ్.. జెట్ స్పీడ్ లో జరుగుతోంది. దసరా రిలీజ్ కి షెడ్యూల్ చేయడంతో ఆ టార్గెట్ ని మిస్ అవకుండా పనులు చేసుకుంటున్నారు. ఒక్క డేట్ కూడా మిస్ కాకుండా వేస్ట్ చేయకుండా దర్శకుడు సురేందర్ రెడ్డి వర్క్స్ చేయిస్తున్నాడంటే.. ధృవ స్పీడ్ అర్ధమవుతుంది. ఇక ఈ ధృవ రిలీజ్ కి రెండు నెలల సమయం మాత్రమే ఉండడంతో.. బిజినెస్ డీలింగ్స్ పూర్తయిపోతున్నాయి.

రీసెంట్ గా ఓవర్సీస్ ప్రైస్ ను లాక్ చేసి... డీల్ క్లోజ్ చేశారు. ధృవ కోసం క్లాసిక్ సినిమాస్ 5 కోట్లు ఇచ్చేందుకు అంగీకరించింది. ఈ ప్రైస్ గిట్టుబాటు కావాలంటే మిలియన్ డాలర్లకు పైగానే ఓవర్సీస్ లో రాబట్టాల్సి ఉంటుంది. కానీ లోకల్ మార్కెట్లో తిరుగులేని స్టామినా చూపించే చెర్రీ.. ఓవర్సీస్ లో వీక్. బ్రూస్ లీకి అతి కష్టం మీద హాఫ్ మిలియన్ రాగా.. చెర్రీ కెరీర్ లో హైయెస్ట్ వసూళ్లు 676,000డాలర్లు గోవిందుడు అందరివాడేలే రాబట్టింది.

తన గెటప్ తో సహా కేరక్టరైజేషన్ కూడా పూర్తిగా మార్చేసి.. చరణ్ కొత్తగా కనిపించడమే ఈ మూవీకి హెవీ ప్రైస్ ఆఫర్ రావడానికి కారణంగా తెలుస్తోంది. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ మూవీ అక్టోబర్ 7న దసరా సీజన్ లో విడుదలకానుంది.
Tags:    

Similar News