'ఇద్దరం కేకులు తినిపించుకుందాం' అంటున్న స్టైలిష్ స్టార్

Update: 2020-04-08 16:04 GMT
టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తనదైన రీతిలో అల్లు అర్జున్ కి పుట్టిన రోజు శుభాకంక్షలు తెలిపారు. కరోనా వైరస్ కారణంగా ప్రతి ఒక్కరూ లాక్ డౌన్ లో ఉంటున్న సంగతి తెలిసిందే. అయితే రామ్ చరణ్ - అల్లు అర్జున్ కి కేక్ తినిపించాలి కానీ దానికి బదులుగా చిన్నతనంలో పుట్టినరోజు జరుపుకున్న ఒక ఫోటోను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసాడు. అయితే ఆ పోస్ట్ పై వెంటనే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ స్పందించారు. రామ్ చరణ్ చేసిన కాప్షన్ కి రిప్లై ఇచ్చాడు. రామ్ చరణ్ కి కృతజ్ఞతలు తెలిపి ఈ కరోనా టైమ్ ముగిసిన తర్వాత ఒకరకి ఒకరం కేక్ తినిపించుకుందాంలే అంటూ నవ్వుతూ బదులిచ్చాడు.

అయితే రామ్ చరణ్ అల్లు అర్జున్ కి మాత్రమే కాకుండా - పవన్ కళ్యాణ్ కొడుకు అకిరాకి - అక్కినేని అఖిల్ లకు కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు. బన్నీ పుట్టినరోజు పై  రాంచరణ్ స్పందించడం పట్ల అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే రామ్ చరణ్ పుట్టిన రోజు సైతం లాక్ డౌన్ లో జరుపుకున్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్ కి సంబంధించిన వీడియోని ఆర్ ఆర్ ఆర్ చిత్రం బృందం విడుదల చేసింది. అలానే అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్ప టైటిల్ - ఫస్ట్ లుక్ లను విడుదల చేసారు చిత్ర బృందం. అల్లు అర్జున్ ఊర మాస్ లుక్ లో అదిరిపోయాడంటూ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Tags:    

Similar News