రజనీకాంత్ గేట్లు తెరిశాడోచ్!!

Update: 2016-08-27 15:30 GMT
''కబాలి'' ఫ్లాప్ అయ్యాక.. అసలు ''రోబో 2.0'' రిలీజ్ అయ్యేవరకు పొరపాటున కూడా తన అభిమానులకు సూపర్ స్టార్ రజనీకాంత్ కనిపించరని టాక్ వచ్చింది. అంతకంటే ముందు కూడా రజనీ తన అభిమానులను కలవలేదు. ముఖ్యంగా ''కబాలి'' సినిమా రిలీజయ్యేవరకు అస్సలు ఇండియాలోనే లేడు. రీజన్లు చెప్పలేదు కాని.. ఆయన అమెరికాలోనే ఉన్నారు.

కట్ చేస్తే ఇప్పుడు నిజంగానే రోబో 2.0 రిలీజ్ అయ్యేవరకు తన అభిమానులకు కనిపించరేమో అనుకుంటే.. ఇప్పుడు తన పోయెస్ గార్డెన్ రెసిడెన్స్ గేట్లను తెరిచి.. అభిమానులను కలుస్తున్నారు రజనీ. వారితో బాగానే టైమ్ స్పెండ్ చేసి.. వారందరికీ తనతో ఫోటోలను తీయించి.. అవన్నీ చేతిలోపెట్టి పంపించారట. మొత్తానికి రజనీ అభిమానులను కలిశారంటే.. ఇప్పుడు అందరూ సంబరాలు చేసుకుంటున్నారు. అయితే రజనీ రోబో 2.0 వచ్చే ఏడాది అక్టోబర్ లో వస్తోంది కదా.. మరి ఈ సంవత్సరం పాటు ఆయన ఏం చేయనున్నారు?

నిజానికి మరో రెండు నెలల్లో ఆయన 2.0 షూటింగ్ మొత్తం పూర్తి చేయనున్నారట. ఒక్కసారి ఈ సినిమా షూటింగ్ పూర్తవ్వగానే దర్శకుడు గౌతమ్ మీనన్ రాసిన కొత్త స్ర్కీప్ట్ ఒకటి రజనీ విననున్నారు. అది కనుక ఓకె అయితే.. ఒక ఆర్నెల్లలో షూటింగ్ పూర్తి చేసేసి.. అసలు దీపావళికి 2.0 రాక మునుపే కొత్త సినిమాను దించేస్తారు రజనీ. జూజూబి.. అక్కడ రజనీ.. ఏదైనా జరగొచ్చమ్మా!!
Tags:    

Similar News