గడిచిన కొద్ది రోజులుగా తమిళనాడు రాజకీయాల్లో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ ప్రవేశం మీద భారీగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అమ్మ మరణం తర్వాత తమిళనాడు రాజకీయాల్లో నెలకొన్న అనిశ్చితి నేపథ్యంలో.. రజనీ పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇవ్వాలని డిసైడ్ చేసినట్లుగా చెబుతారు. అయితే..ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన మాత్రం ఆయన నోటి నుంచి ఇప్పటివరకూ వచ్చింది లేదు.
దేవుడు ఆదేశిస్తే.. ఏం చేయటానికైనా సిద్ధమేనంటూ సినిమాటిక్ డైలాగ్ చెప్పిన రజనీ.. తన పొలిటికల్ ఎంట్రీ మీద మాట్లాడింది లేదు. ఇటీవల అభిమానులతో ఐదు రోజుల పాటు భేటీ అయి.. వారితో ఫోటోలు దిగి సంతోషానికి గురి చేశారు. ఈ మధ్యనే రైతుల్ని కలిసిన ఆయన.. వారికి నగదు సాయం అందిస్తానని చెప్పటం ఆసక్తికరంగా మారింది. రైతుల్ని పిలిపించుకొని మరీ వారికి హామీ ఇవ్వటం చూసిన తర్వాత ఆయన పొలిటికల్ ఎంట్రీ పక్కా అన్నది తేలిపోయింది.
అయితే.. ఇదెప్పుడున్న సందేహం కూడా తాజాగా చేసిన ప్రకటనతో ఒక క్లారిటీ వచ్చినట్లేనని చెబుతున్నారు. మొన్నటివరకూ తన రాజకీయ రంగప్రవేశం మీద మౌనంగా ఉన్న ఆయన.. ఇప్పుడు ఉత్కంఠ పెంచేలా ప్రకటన చేయటం ఆసక్తికరంగా మారింది.
రోబో 2.0 మూవీ విడుదల తర్వాత తన రాజకీయ ప్రవేశంపై బిగ్ అనౌన్స్ మెంట్ ఇవ్వనున్నట్లుగా రజనీ ప్రకటించారు. మరో రెండు.. మూడు నెలల వ్యవధిలో మరోసారి తన అభిమానుల్ని కలుసుకోనున్నట్లుగా ఇప్పటికే ప్రకటించిన రజనీ తీరు చూస్తుంటే.. రాజకీయ రంగప్రవేశానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారన్న మాట వినిపిస్తోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/