రామారావు చెవిలో ఏం ఊదుతున్నారు జక్కన్నా?
దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళితో నందమూరి తారక రామారావు అనుబంధం గురించి తెలిసిందే. స్టూడెంట్ నంబర్ -1 చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ ని కెరీర్ కి అందించి అటుపై ఇండస్ట్రీ బెస్ట్ హిట్ సింహాద్రితో తారక్ రేంజునే మార్చేసిన గొప్ప స్నేహితుడు రాజమౌళి. అసలేమీ తెలియని యుక్త వయసులోనే తారక్ ని పెద్ద స్టార్ ని చేసాడు జక్కన్న. అటుపై పరిపూర్ణమైన వ్యక్తిత్వంతో తారక్ ప్రతిదీ తనవైపు తిప్పుకుని పరిశ్రమ అగ్ర హీరోల్లో ఒకడిగా నిలదొక్కుకున్నాడు.
ఈ జోడీ ప్రతిసారీ ఏదో ఒక కొత్త మ్యాజిక్ చేసేందుకు కలుస్తూనే ఉంటారు. ఈసారి ఆర్.ఆర్.ఆర్ లాంటి భారీ పాన్ ఇండియా చిత్రంతో ఇండియా లెవల్లో సంచలనాలకు రెడీ అయ్యారు. జనవరి 7 రిలీజ్ తేదీ దగ్గర పడుతున్న కొద్దీ ఆ ఇద్దరి ప్రచారం మరింతగా హోరెత్తుతూనే ఉంది.
ఇంతకీ జక్కన్న ఇలా తారక్ చెవిలో ఏం ఊదుతున్నారో కానీ.. అదేదో బ్రహ్మ రహస్యంలానే కనిపిస్తోంది. ఇది ఆన్ లొకేషన్ స్టిల్. ఇక ఆర్.ఆర్.ఆర్ లోగోతో ఉన్న షర్ట్ ని తారక్ ధరించారు. ఆ ఇద్దరూ ఏదో చాలా సీరియస్ గానే మంతనం సాగిస్తున్నారు. తారక్ ఎంత స్టైలిష్ గా ఉన్నాడో అంతకుమించి జక్కన్న గాగుల్స్ ధరించి స్టైలిష్ గా కనిపిస్తున్నారు. సీన్ పండించాలంటే ఆ మాత్రం సింక్ ఉండాలి. కాకమీద ఉన్నప్పుడే ఏదైనా చేయగలం అన్న కాన్ఫిడెన్స్ కనిపిస్తోంది ఆ ఇద్దరిలో.. ఆర్.ఆర్.ఆర్ రిజల్ట్ ఏంటో జనవరి 6న ముందస్తు ప్రీమియర్లతో తేలనుంది. 600కోట్ల నుంచి 1000 కోట్ల మధ్య వసూళ్లతో ఆర్.ఆర్.ఆర్ దుమారం రేపుతుందని అభిమానులు భావిస్తున్నారు. ఏం జరుగుతోందో జస్ట్ వెయిట్.