వాటికైతే అడల్ట్ మూవీస్ లేవా?

Update: 2017-09-20 06:27 GMT
సౌత్ లో క్రేజీ హీరోయిన్ గా పేరు తెచ్చుకోవాలని రాయ్ లక్ష్మి ఎప్పటి నుంచో తపిస్తోంది. హోమ్లీ గర్ల్ పాత్రల నుంచి హాట్ హాట్ ఫోజుల వరకు... ఐటం పాటల నుంచి హర్రర్ సినిమాల వరకు చాలా పాత్రలే చేసింది. కానీ ఆమె ఫిగర్ కు గుర్తింపు వచ్చింది తప్ప నటనకు మాత్రం రాలేదు. అయినా పట్టు వదలకుండా ప్రయత్నాలు చేస్తూనే ఉంది.  బాలీవుడ్ లో మొదటిసారి హీరోయిన్ గా చేస్తున్న జూలీ-2 సినిమా ద్వారా తాను కోరుకున్న గుర్తింపు తెచ్చుకుంటానని ఆశపడుతోంది.

ఎరోటిక్ సినిమాలు బాలీవుడ్ లో కొత్తేమీ కాదు. కానీ సౌత్ హీరోయిన్ ఎరోటిక్ సినిమా చేయడం.. ఉత్తరాది భామలను మించి వెండితెరపై విచ్చలవిడిగా అందాలు ఆరబోయడం మాత్రం ఇదే మొదటిసారి. సినిమా ప్రమోషన్లలో భాగంగా రాయ్ లక్ష్మి తన హాట్ ఫోజులతో చూస్తున్న వారి మతులు పొగొట్టేస్తోంది. ఈ రేంజిలో రెచ్చిపోవడం ఎందుకని అడిగితే ఆ మాత్రం అవసరమే అంటోంది. ‘‘సెక్స్ సీన్ల కోసం జనాలు సినిమాకు వస్తారనడం కరెక్ట్ కాదు. దానికి అడల్ట్ సినిమాలు ఉన్నాయి. అవి చూసుకోవడం బెటర్. సినిమాలో ఓ ముద్దు సీన్ ఉండాల్సిన చోట  కౌగిలింత చూపిస్తే ఏమవుతుంది? ప్రేక్షకుడు చిరాకు పడతాడు. తనను మోసం చేశారనే అనుకంటాడు. ఆ ఫీలింగ్ క్యారీ అవ్వాలంటే ముద్దు సీన్ ఉండాల్సిందే. అలాగని ఒక్క ముద్దు సీన్ సుదీర్ఘంగా ఉన్నా బోర్ కొట్టేయడం ఖాయం.’’ అంటూ రాయ్ లక్ష్మి  కొత్త ఫిలాసఫీ చెప్పుకొచ్చింది.

ఇంతవరకు బాగానే ఉన్నా క్రికెటర్ ఎం.ఎస్.ధోనితో గతంలో ఉన్న రిలేషన్ షిప్ గురించి అడిగిన వారికి రాయ్ లక్ష్మి దిమ్మతిరిగే సమాధానం ఇస్తోంది. ‘ధోనీయా.. అతడెవరు’ అన్న ఒక్క మాటతో అందరూ అవాక్కయిపోయేలా చేస్తోందీ భామ. ఏదైనా రాయ్ లక్ష్మీ.. ఇది మరీ టూ మచ్ గా లేదూ..
Tags:    

Similar News