ఫస్ట్ లుక్: ఖాకీలో కృష్ణుడు..రాధ

Update: 2017-02-24 10:54 GMT
ఒక కొత్త దర్శకుడు డైరక్షన్లో ఇప్పుడు శర్వానంద్ మరో సినిమాతో దూసుకొస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ''రాధ'' అనే టైటిల్ ను కన్ఫామ్ చేసినట్లు ఆల్రెడీ చెప్పుకున్నాం. చంద్రమోహన్ డైరక్షన్లో రూపొందిన ఈ సినిమా ఫస్ట్ లుక్ ను ఇప్పుడు శర్వానంద్ రిలీజ్ చేశాడు.

మొత్తం ఖాకీ గెటప్.. నెత్తిన కిరీటం.. చేతిలో ఫ్లూటు.. చూస్తుంటే ఖాకీ డ్రస్సు వేసుకున్న కృష్ణుడిలా లేడు? అచ్చం అలాగే ఉన్నాడు. అంటే ఈ సినిమా కూడా బాబు బంగారం సినిమా తరహాలో ఒక ఖాకీ లవ్ స్టోరీ అనమాట. ఈ సినిమాలో లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే దాదాపు 70% షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను మార్చి 29న ఉగాది కానుకగా విడుదల చేస్తున్నారట. మొత్తానికి ఈ ఏడాది ఆల్రెడీ శతమానం భవతి సినిమాతో సక్సెఫుల్ గా ఖాతా ఓపెన్ చేసి.. ఇప్పుడు ఇలా రాధగా దూసుకొస్తున్నాడనమాట.

ఇకపోతే ఈ సినిమా కూడా శతమానం తరహాలో భారీగా హిట్టు కొట్టిందంటే మాత్రం.. ఇక శర్వానంద్ పొజిషన్ ఓ రేంజులో ఫిక్సయినట్లే. మనోడు కూడా నాని తరహాలో డిపెండబుల్ హీరో అయిపోతాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News