ఆశపడితే డైరెక్ట్ గా అడగరు

Update: 2017-11-18 11:01 GMT

ఏ సినీ ఇండస్ట్రీలో అయినా వెండితెర వెనుక నటీమణులు లైంగిక వేధింపులకు గురికాకుండా ఉండలేరని రీసెంట్ గా కొంతమంది స్పందించిన తీరును చూస్తే అర్ధం చేసుకోవచ్చ. హాలీవుడ్ లో ఎప్పుడితే ఓ నిర్మాత అసలు రంగు బయటపడిందో అప్పటి నుంచి ఇండియన్ హీరోయిన్స్ తాము కూడా లైంగిక వేధింపులకు గురయ్యామని చెప్పుకొచ్చారు.

మొన్నటి వరకు సోషల్ మీడియాలోనే స్పందించిన హీరోయిన్స్ ఇప్పుడు డైరెక్ట్ గా మీడియా ముందు కూడా చెబుతున్నారు. అయితే లక్ష్మి రాయ్ ఈ మధ్య క్యాస్టింగ్ కౌచ్ గురించి ఓ రేంజ్ లో ప్రస్తావనకు తెస్తోంది. ఎలాంటి ప్రశ్నలు ఎదురువవుతున్నా విసుక్కోకుండా చెబుతోంది. రీసెంట్ గా జూలీ 2 చిత్ర ప్రమోషన్ లో భాగంగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో అమ్మడు కొన్ని ఘాటైన విషయాలను బయటపెట్టింది.

ఇండస్ట్రీలో హీరయిన్ పై ఆశపడితే డైరెక్ట్ గా అడగరు. అంతే కాకుండా నాతో పడుకుంటావా? శృంగారం చేస్తావా అని బ్రతిమాలరూ బెదిరించారు. దానికి మారో దారి ఉందంటోంది రాయ్ లక్ష్మి. ఆ రూట్ లో వచ్చి వారు అనుకున్నది దక్కించుకుంటారని కూడా చెప్పింది. దీంతో అమ్మడు చెప్పిన విధానానికి అందరు షాక్ అవుతున్నారు. ఓ విధంగా ఈమె చేస్తున్న కామెంట్స్ సినిమాకి కొంచెం హెల్ప్ అవుతున్నట్లు తెలుస్తోంది.
Tags:    

Similar News